ఏపీలో సంక్షేమ పథకాల నిధులు విడుదల నిలిపివేయాలని ఈసీ ఇచ్చిన ఆదేశాలు సవాలు చేస్తూ ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. ఈ క్రమంలో.. న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఈసీ ఆదేశాలతో రైతులకు ఇన్పుట్ సబ్సిడీ నిలిచి పోయిందని పిటిషనర్ కోర్టుకు దృష్టికి తీసుకొచ్చారు. ఏపీలో కరువు మండలాల్లో రైతుల ఇబ్బందులను గుర్తించటానికి 2023లోనే ప్రభుత్వం కలెక్టర్లతో కమిటీ వేసిందని పిటిషనర్ పేర్కొన్నారు. 108 కరువు మండలాల్లో 6.95 లక్షల రైతులను గుర్తించి గత ఏడాది అక్టోబర్లో కమిటీ రిపోర్ట్ ఇచ్చినట్టు పిటిషనర్ తెలిపారు. ఎన్నికల కోడ్ రాక ముందే లబ్ధిదారుల గుర్తింపు, జీఓ విడుదల చేసినట్టు పిటిషనర్ కోర్టుకు తెలిపారు. ఎన్నికల కోడ్కు 4 నెలల కింద ఈ ప్రోసెస్ జరిగిందని.. ఇప్పుడు కేవలం లబ్దిదారులకు సొమ్ము జమ చేస్తున్నామని కోర్టుకు తెలిపారు. ఇది ఎన్నికల సమయంలో కొత్తగా తీసుకువచ్చిన పథకం కాదన్నారు పిటిషనర్. వరదలు, ఆన్ గోయింగ్ స్కీమ్స్, అత్యవసర పరిస్థితుల్లో సాయం అపాల్సిన అవసరం లేదని ఎన్నికల కమిషన్ రూల్స్లో ఉందని పిటిషనర్ కోర్టుకు చెప్పారు.
RR vs DC: ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించాలని లక్ష్యంగా బరిలోకి రాజస్థాన్ రాయల్స్..
గత ఏడాదిలో నాలుగు దశల్లో జరిగిన ఈ ప్రక్రియకు చివరగా నగదు జమ చేస్తున్నారు తప్ప.. కొత్తగా కాదని పిటిషనర్ కోర్టు దృష్టికి తెచ్చారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులోకి రావటానికి ముందు 4 నెలల క్రితమే ఈ ప్రక్రియ చేపడితే ఎన్నికల సంఘం ఇప్పుడు ఇలా నిలిపి వేస్తూ ఆదేశాలు ఇస్తుందని పిటిషనర్ పేర్కొన్నారు. ఇది ఏ విధంగా ఎన్నికల నిబంధనలు అతిక్రమించినట్టు అని పిటిషనర్ తెలిపారు. కరువు మండలాల్లో రైతులకు మే, జూన్, జులై నెలలో సాయం చేస్తామని.. ఇపుడు అది అందకపోతే రైతులు ఇబ్బంది పడతారని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. ఇన్ పుట్ సబ్సిడీ అనేది ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్ తప్ప కొత్తది కాదని పిటిషనర్ పేర్కొన్నారు. కరువు మండలాల గుర్తింపు, లబ్దిదారుల గుర్తింపు అంతా.. కోడ్ రాక ముందే చేశామని, ఇది ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్ కిందే వస్తుందని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ, అరియర్స్ ఇప్పుడు ప్రకటిస్తే.. అది ఇప్పుడు కొత్తగా ప్రకటించినట్టు అవుతుందన్నారు. ప్రతి నెలా ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్ కింద ఫించన్లు ఇస్తున్నారు కదా అని న్యాయస్థానం పేర్కొంది. ఇన్ పుట్ సబ్సిడీ నిధుల విడుదలపై ప్రభుత్వం వినతి పత్రం ఇస్తే పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని ఈసీ కోర్టుకి తెలిపింది. ప్రభుత్వం తరఫున స్క్రీనింగ్ కమిటీ ఇప్పటికే ఈసీనీ కలిసి విషయం తెలిపినట్టు ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. కొత్తగా నిధుల విడుదల చేయాలని.. డీటైల్డ్ వినతి పత్రం ఇవ్వాలని ఈలోపు ఈసీ నిర్ణయం తెలపాలని ఏపీ హైకోర్టు పేర్కొంది. కాగా.. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.
