NTV Telugu Site icon

Lunar Eclipse 2024: హోలీరోజే చంద్రగ్రహణం.. పండుగ జరుపుకోవచ్చా?

Lunar Eclipse 2023

Lunar Eclipse 2023

Lunar Eclipse 2024: హోలీ పండుగ రోజునే చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం మార్చి 25న జరగనుంది. ఇదిలా ఉండగా.. ఈ ఏడాది హోలీ, చంద్రగ్రహణం ఒకేరోజు వస్తున్నాయి. కాబట్టి హోలీ పండుగ జరుపుకోవచ్చా లేదా అనుమానం చాలామందిలో ఉంది. ఆ రోజు పండుగ జరుపుకోవచ్చా.. లేదా అనే చాలా మందికి సందేహం కలుగుతుంది. వాస్తవానికి 1924లో హోలీ రోజున సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడింది. మళ్లీ ఇప్పుడు వచ్చింది. చంద్రగ్రహణం ఫాల్గుణ మాసం శుక్ల పక్ష పౌర్ణమి రోజున అంటే 25 మార్చి 2024 సోమవారం చంద్రగ్రహణం ఏర్పడనుంది. చంద్రగ్రహణం ఉదయం 10:23 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 3:02 గంటల వరకు ఉంటుందని పండితులు చెబుతున్నారు.

Read Also: Sadananda Gowda: బీజేపీకి షాక్.. రాజకీయాల గుడ్ బై చెప్పిన మాజీ సీఏం..

ఈ సంవత్సరం ఏర్పడే తొలి చంద్రగ్రహణం ఇదే కావడం గమనార్హం. హిందూ పంచాంగం ప్రకారం, ప్రతి ఏడాది ఫాల్గుణ మాసంలో శుక్ల పక్ష పౌర్ణమి రోజున హోలీ వేడుకలను జరుపుకుంటారు. ఈసారి మార్చి 25వ తేదీ సోమవారం నాడు ఈ సంబురాలను జరుపుకోనున్నారు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, హోలీ పండుగ రోజునే కన్యరాశిలో చంద్ర గ్రహణం ఏర్పడనుంది. ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు. ఈ సమయంలో మీన రాశిలో సూర్యుడు, రాహువు, కుంభంలో శుక్రుడు, కుజుడు, శని ఉంటారు. గ్రహణం అర్ధరాత్రి 4 గంటల 36 నిమిషాల పాటు ఉంటుంది. ఉత్తర, తూర్పు ఆసియా, యూరప్, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్, ఆర్కిటిక్, అంటార్కిటికాలోని చాలా ప్రాంతాల్లో ఈ చంద్రగ్రహణం కనిపిస్తుంది.

హోలీ పండుగపై చంద్రగ్రహణం ఎలాంటి నెగటివ్‌ ఎఫెక్ట్‌ చూపించదని పండితులు చెబుతున్నారు. హాయిగా హోలీ పండుగ జరుపుకోవచ్చని, ఈ విషయంలో ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని చెబుతున్నారు. ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం హోలీ రోజున వస్తుంది కాబట్టి కొన్ని రాశుల వారికి శుభప్రదం అని చెబుతున్నారు. ఈ చంద్రగ్రహణం మన దేశంలో కనిపించదు కాబట్టి ఎలాంటి పరిహారాలు చేయనవసరం లేదని పేర్కొంటున్నారు. అయితే 100 సంవత్సరాల హోలీ రోజున వచ్చిన ఈ చంద్ర గ్రహణం సమయంలో కొన్ని రాశుల వారికి విశేష ప్రయోజనాలు లభించనున్నాయి.