NTV Telugu Site icon

Taj Hotel Bomb Threat: తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపు

Taj Hotel

Taj Hotel

Taj Hotel Bomb Threat: లక్నోలోని తాజ్ హోటల్‌కు సోమవారం నాడు ఇమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చింది. అయితే ఇదివరకే నగరంలోని 10 హోటళ్లకు ఇలాంటి బెదిరింపులు వచ్చాయి. హజ్రత్‌గంజ్ ప్రాంతంలో ఉన్న తాజ్ హోటల్‌కు పంపిన ఇమెయిల్‌లో ఆవరణలో బాంబు పేలుడు సంబంధిత విషయం ఉందని హెచ్చరించినట్లు పోలీసు వర్గాలు నివేదించాయి. ఆదివారం (అక్టోబర్ 27) లక్నోలోని 10 హోటళ్లకు ఇలాంటి బాంబు బెదిరింపు రావడంతో బాంబ్ స్క్వాడ్ క్షుణ్ణంగా సోదా చేసింది. అయితే, ప్రాంగణాన్ని విస్తృతంగా పరిశీలించిన తర్వాత, అన్ని బెదిరింపులు నిరాధారమైనవిగా తేల్చారు అధికారులు.

Read Also: PM Modi on Ratan Tata: దేశం ఓ గొప్ప కుమారుడిని కోల్పోయింది

ఈ నేపథ్యంలో మరోమారు ప్రముఖ అధికారులు లక్నో నగరంలోని ప్రముఖ హోటల్‌ తాజ్ బాంబు బెదిరింపు రావడంతో.. మరోసారి బాంబు స్క్వాడ్‌లను రంగంలోకి దించి హోటల్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఇమెయిల్ మూలంపై విచారణ చేపడుతున్నారు అధికారులు. విషయం సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియసి ఉంది. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా వందలాది విమానాల బాంబుల బెదిరింపుతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈమెయిల్స్ ద్వారా వచ్చే ఈ బెదిరింపుల వల్ల చాలామంది ఇబ్బంది గురవుతున్నారు. ముఖ్యంగా ప్రయాణికులు వారు చేరుకోవాల్సిన గమ్య స్థానాన్ని సమయంలో చేరుకోలేక అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అలాగే విమానా సంస్థలు కూడా సెక్యూరిటీ నిబంధనలను అనుసరించి కూడా పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవడానికి ప్లాన్ చేస్తోంది.

Read Also: Nara Lokesh: ఆర్టీసీ డ్రైవర్‌కు బంపర్ ఆఫర్ ఇచ్చిన మంత్రి లోకేష్.. ట్వీట్ వైరల్