Site icon NTV Telugu

Naveen Ul Haq : విరాట్ కోహ్లీకి కౌంటరిచ్చిన నవీన్ ఉల్ హాక్

Naveen Ul Haq

Naveen Ul Haq

ఇండియన్ ప్రీమియ్ లీగ్ సీజన్ 16లో భాగంగా అటల్ బీహార్ వాజ్ పేయ్ స్టేడియంలో నిన్న ( మే 1 ) లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 18 పరుగుల తేడాతో సంచలన విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం స్టేడియంలో చోటు చేసుకున్న పరిణామాలు సైతం అందరికీ తెలిసిందే. లక్నో ప్లేయర్ నవీన్ ఉల్ హాక్-విరాట్ కోహ్లీ మధ్య మాటలు చినిచినికి గాలి వానలా మారి, జెంటిల్మెన్ గేమ్ కు మాయని మచ్చ తెచ్చిపెట్టారు.

Also Read : Two Wheeler Sales: ఏపీలో క్షీణించిన ద్విచక్ర వాహనాల అమ్మకాలు.. ఏకంగా 8.03 శాతం డౌన్‌..!

మ్యాచ్ తరువాత గొడవకు కారకులైన నవీన్ ఉల్ హాక్- విరాట్ కోహ్లీ తమ సోషల్ మీడియా అకౌంట్ ల్లో పోస్ట్ చేసిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. కోహ్లీ తన ఇన్ స్టా గ్రామ్ స్టోరీలో ఇలా రాసుకొచ్చాడు.. మనం వినే ప్రతీ విషయం ఎవరో ఒకరి అభిప్రాయం మాత్రమే.. అదే నిజం కాదు.. మనం చూసే ప్రతీది వాస్తవం కాదు.. మన దృక్కోణానికి సంబంధించింది అని మీనింగ్ వచ్చేలా ఓ కోటేషన్ ను కోహ్లీ పోస్ట్ చేశాడు.

https://twitter.com/BilluPinkiSabu/status/1653110130471231509

Also Read : Rashmika: నేషనల్ క్రష్ ఫేవరేట్ ‘క్రికేటర్ & IPL’ టీమ్ ఇదే!

దీనికి కౌంటర్ గా నవీన్ ఉల్ హాక్ మరో స్టోరీని ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేశాడు. మీకు అర్థమైనది మీకు దక్కుతుంది. అది ఎలాగైనా జరిగి తీరుతుంది అని అర్థం వచ్చేలా ఈ అప్ఘన్ ప్లేయర్ మరో కోటేషన్ ను రాసుకొచ్చాడు. విరాట్ కోహ్లీ- నవీన్ ఉల్ హాక్ ఏ ఉద్దేశంతో ఈ పోస్టులు చేశారో తెలియదు కానీ.. మ్యాచ్ అనంతరం జరిగిన పరిణామాలను మనసులో ఉంచుకునే ఈ కోట్స్ షేర్ చేశారన్నది క్లియర్ గా అర్థం అవుతుంది.

Also Read : Sitamma Sagar : సీతమ్మ సాగర్ మల్టీ పర్పస్ ప్రాజెక్ట్ దృష్టి సారించిన ప్రభుత్వం

కాగా ఆర్సీబీ నిర్థేశించిన 127 పరుగుల టార్గెట్ ఛేదించే క్రమంలో ఇన్సింగ్స్ 18వ ఓవర్ తొలి బంతి తర్వాత నవీన్-కోహ్లీల మధ్య ఫస్ట్ గొడవ జరిగింది. ఊహించినంత త్వరగా విజయం దక్కకపోవడంతో ( మిశ్రా, నవీన్ ఔటవ్వకుండా ఆడుతున్నారు ) అసహనంతో ఉండిన కోహ్లీ.. తొలుత మిశ్రాపై, ఆ తర్వాత నవీన్ పై నోరు పారేసుకున్నాడు.

Exit mobile version