LSG vs RR : నాలుగో వికెట్‌ కోల్పోయిన లక్నో

Rr Vs Lsg

Rr Vs Lsg

జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం వేదికగా రసవత్తరమైన మ్యాచ్‌ జరుగుతోంది. ఐపీఎల్ 2023 సీజన్‌లో 26వ మ్యాచ్‌ సంజూ శాంసన్ రాజస్థాన్ రాయల్స్, కేఎల్ రాహుల్ నేతృత్వంలోని లక్నో సూపర్ జెయింట్‌తో తలపడుతోంది. అయితే.. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్‌లో పాయింట్ల పట్టికలో ఈ రెండు జట్లు ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచాయి. అయితే ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన రాజస్థాన్‌ రాయల్స్‌ బౌలింగ్‌ ఎంచుకుంది. దీంతో లక్నో బ్యాటింగ్‌కు దిగింది. అయితే.. లక్నో నుంచి ఓపెనింగ్‌కు దిగిన కైల్‌ మేయర్స్‌ , కేఎల్‌ రాహుల్‌ నెమ్మదిగా ఆట ప్రారంభించిన.. 39 పరుగులు చేసిన కేఎల్‌ రాహుల్‌ హోల్డర్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి బట్లర్‌కు క్యాచ్‌ ఇచ్చి తొలి వికెట్‌ను సమర్పించుకున్నాడు.

Also Read : Happiest State : ఇండియాలోనే అత్యంత సంతోషకరమైన రాష్ట్రం ఏదో మీకు తెలుసా..?

బౌల్ట్ బౌలింగ్‌లో ఆయుష్ బదోని(1) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 85 ప‌రుగుల వ‌ద్ద ల‌క్నో రెండో వికెట్‌ను కోల్పోయింది. అయితే.. 14వ ఓవ‌ర్‌ను అశ్విన్ వేయగా.. రెండో బంతికి దీప‌క్ హుడా షాట్ ఆడి షిమ్రాన్ హెట్మెయర్ చేతికి చిక్కి పెవిలియన్‌ చేరాడు. ఐదో బంతికి కైల్ మేయర్స్ ను అశ్విన్ క్లీన్ బౌల్డ్ చేయడంతో ఒకే ఓవర్లో అశ్విన్‌ రెండు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. 14 ఓవ‌ర్లు ముగిసే సరికి ల‌క్నో స్కోరు 4 వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది. మార్కస్ స్టోయినిస్(5), నికోల‌స్ పూర‌న్‌(0) క్రీజులో ఉన్నారు.

Also Read : Samantha: సామ్ వేసుకున్న ఆ డైమండ్ నెక్లస్ ఎన్ని కోట్లో తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే