Indian Player: మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం.. రూ. 95 లక్షల లంచం ఇస్తూ దొరికిపోయిన భారత ప్లేయర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీలంక ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీ ‘జాఫ్నా కింగ్స్’ సహ-యజమాని, భారత మాజీ అండర్-19 క్రికెటర్ మంజోత్ కల్రాను శ్రీలంక క్రీడల అవినీతి నిరోధక విచారణ విభాగం పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. టోర్నమెంట్ ఆరో సీజన్ ప్రారంభానికి కొన్ని గంటల ముందే ఈ నాటకీయ పరిణామం చోటుచేసుకుంది. 2018 అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్లో సెంచరీ సాధించి భారత్‌కు విజయాన్ని అందించిన మంజోత్ కల్రా, ఇటీవల స్పోర్ట్స్ బిజినెస్‌లోకి ప్రవేశించి ఈ ఏడాది ప్రారంభంలో జాఫ్నా కింగ్స్ ఫ్రాంచైజీలో పెట్టుబడి పెట్టారు. అయితే.. ఎల్పీఎల్ (లంక ప్రీమియర్ లీగ్) మ్యాచ్‌ల సందర్భంగా ఒక ఆటగాడికి భారీగా డబ్బు ఆశ చూపి, ప్రభావితం చేయడానికి ప్రయత్నించారనే ఆరోపణలపై క్రీడలకు సంబంధించిన నేరాల నిరోధక ప్రత్యేక విచారణ విభాగం పోలీసులు ఆయనను కొలంబోలోని ఒక హోటల్లో అదుపులోకి తీసుకున్నారు.
సమాచారం ప్రకారం.. మంజోత్ కల్రా ఒక ఆటగాడికి దాదాపు 95 లక్షల రూపాయలు లంచం ఇవ్వబోతుండగా పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సుమారు పది రోజుల క్రితమే నిందితుడు తనను సంప్రదించాడని సదరు ఆటగాడు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ విచారణ ప్రారంభమైంది. జాఫ్నా కింగ్స్ ఫ్రాంచైజీకి ఆడుతున్న శ్రీలంక ఆటగాళ్లు భానుక రాజపక్ష, అవిష్క ఫెర్నాండో, దునిత్ వెల్లాలగేలు ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. జాఫ్నా కింగ్స్ , గాల్ గ్యాలెంట్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగాల్సిన రోజే ఈ అరెస్ట్ కావడం క్రికెట్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది.
Also Read
- Mallikarjun Kharge: ప్రధాని మోడీ, అమిత్‌షాకు ఖర్గే లేఖ.. వారిని కాపాడాలని విజ్ఞప్తి
- PM Modi: విదేశీ పర్యటనకు ప్రధాని మోదీ.. ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్ రిపబ్లిక్లో కీలక పర్యటన.!
- US-Venezuela Oil Deal: అమెరికా-వెనిజులా బిగ్ డీల్.. ట్రంప్ సంచలన ప్రకటన
- Janasena Party: స్థానిక పోరుకు జనసేన సిద్ధం.. 30 రోజుల పాటు ప్రత్యేక ప్రణాళిక
ఎల్పీఎల్లో మ్యాచ్ ఫిక్సింగ్, లంచాలు, అవినీతి ఆరోపణలు రావడం ఇదే మొదటిసారి కాదు. ఈ ఏడాది ప్రారంభంలోనే బంగ్లాదేశ్‌కు చెందిన దంబుల్లా థండర్స్ యజమాని తమీమ్ రెహమాన్ కూడా బెట్టింగ్ కార్యకలాపాలకు పాల్పడినట్లు కోర్టులో అంగీకరించడంతో అతనికి నాలుగేళ్ల జైలు శిక్షతో పాటు 2.4 కోట్ల రూపాయల జరిమానా విధించారు. ఈ వివాదాలు ఎలా ఉన్నప్పటికీ, టోర్నమెంట్ ఐదు జట్లతో షెడ్యూల్ ప్రకారం ఎటువంటి ఆటంకం లేకుండా కొనసాగుతుందని శ్రీలంక క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది.
తాజావార్తలు
-
Mallikarjun Kharge: ప్రధాని మోడీ, అమిత్‌షాకు ఖర్గే లేఖ.. వారిని కాపాడాలని విజ్ఞప్తి
-
PM Modi: విదేశీ పర్యటనకు ప్రధాని మోదీ.. ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్ రిపబ్లిక్లో కీలక పర్యటన.!
-
GST Bribery Case: లంచం బాగోతం.. రూ.1.50 కోట్లు డిమాండ్.. రూ.40 లక్షలకు ఒప్పందం.. ఇద్దరు GST అధికారులు అరెస్ట్
-
Disha Salian Case: 14వ అంతస్తు నుంచి పడితే గాయాలు ఎందుకు లేవు?.. సుశాంత్ మాజీ మేనేజర్ దిశా కేసులో హైకోర్టు ప్రశ్నలు
-
Explainer: చైనా దాచిన మహా ప్రళయం! 2.3లక్షల మంది హతం.. ఆ రాత్రి ఏం జరిగింది?
ట్రెండింగ్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!