Gas Cylinder: ఒక ఇంట్లో ఎన్ని గ్యాస్ సిలిండర్లు ఉండాలి..? ఈ నిబంధనలు తెలియకపోతే జైలుకే..
- ఏడాదికి 15 గ్యాస్ సిలిండర్లు బుకింగ్..
- ఇంట్లో రెండు సిలిండర్లకు మాత్రమే అనుమతి..
- అక్రమ నిల్వలుంటే తప్పని కఠిన చర్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం మన దేశంలోని పలు నగరాల్లో వంటగ్యాస్ (LPG) సరఫరాపై ఒత్తిడి పెరుగుతోంది. గ్యాస్ సిలిండర్ల డిమాండ్ పెరగడం, రవాణాలో కొన్ని అడ్డంకులు ఎదురవ్వడంతో డెలివరీలో జాప్యం జరుగుతోంది. ఇదే సమయంలో ప్రభుత్వం గృహ అవసరాలకు వాడే సిలిండర్లు, వ్యాపార అవసరాలకు వాడే సిలిండర్ల ధరలను కూడా పెంచింది. ఈ నేపథ్యంలో ఒక కుటుంబం ఏడాదికి ఎన్ని సిలిండర్లు బుక్ చేసుకోవచ్చు, ఇంట్లో ఎన్ని ఉంచుకోవచ్చు అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం.. ఒక కుటుంబం ఏడాదికి (ఆర్థిక సంవత్సరం) 12 సబ్సిడీ సిలిండర్లను పొందే హక్కు ఉంటుంది. ఒకవేళ అంతకంటే ఎక్కువ అవసరమైతే, మరో మూడు సిలిండర్లను మార్కెట్ ధర చెల్లించి తీసుకోవచ్చు. అంటే మొత్తం మీద ఏడాదికి 15 సిలిండర్ల వరకు బుక్ చేసుకునే అవకాశం ఉంది. అయితే.. గ్యాస్ సిలిండర్ల అక్రమ నిల్వలను అరికట్టడానికి ప్రభుత్వం ఒక బుకింగ్‌కు, మరో బుకింగ్‌కు మధ్య కనీసం 25 రోజుల గ్యాప్ ఉండాలని నిబంధన పెట్టింది. సాధారణంగా ఇంట్లో భద్రతా కారణాల దృష్ట్యా కేవలం రెండు సిలిండర్లను (ఒకటి వాడుకలో, మరొకటి రిజర్వ్) మాత్రమే ఉంచుకోవాలి. వ్యాపారాల కోసం అయితే 100 కిలోల వరకు గ్యాస్‌ను అనుమతి లేకుండా నిల్వ చేసుకోవచ్చు.. అంతకు మించితే ప్రత్యేక అనుమతులు అవసరం. ఇంత కంటే ఎక్కువ నిల్వ ఉంచితే చట్ట ప్రకారం చర్యలు తీసుకునే అవకాశాలు ఉంటాయి. జైలుకు వెళ్లే ప్రమాదం కూడా ఒక్కోసారి ఉంటుంది. అందుకు ఇంట్లో రెండు కంటే ఎక్కువ గ్యాస్ సిలిండర్లు ఉండటానికి వీలు లేదని నిబంధనలు తెలుపుతున్నాయి.
Also Read
- Abhijeet Dipke Controversy: రామ మందిర CEOపై తప్పుడు వీడియో.. అభిజీత్ దీప్కేపై విమర్శలు..
- Vaibhav Sooryavanshi: చిన్న వయసులోనే ఊహించని పాపులారిటీ.. వైభవ్ వైభవ్ అంటూ మాస్ మేనియా..
- India Diesel Exports: రష్యా, అమెరికాను వెనక్కి నెట్టి.. యూరప్ డీజిల్ సరఫరాలో భారత్ టాప్
- Nepal Earthquake: ఓ వైపు వరద విలయం.. నేపాల్‌లో భూకంపం..
Also Read:Stock Market Rise: స్టాక్ మార్కెట్ ఈ రోజు సడన్‌గా పెరగడానికి కారణం ఏంటి..? ఏం జరిగిందంటే..
ఇక ధరల విషయానికి వస్తే.. దేశవ్యాప్తంగా డొమెస్టిక్ సిలిండర్ ధర 60 రూపాయలు, కమర్షియల్ సిలిండర్ ధర 144 రూపాయలు పెరిగింది. డొమెస్టిక సిలిండర్ ధర హైదరాబాద్‌లో రూ. 965.00 గా ఉంది. ఇతర నగరాల్లో చూస్తే ఢిల్లీలో రూ. 913, ముంబైలో రూ. 912.50, బెంగళూరులో రూ. 915.50, చెన్నైలో రూ. 928.50, కోల్‌కతాలో రూ. 939 , పాట్నాలో అత్యధికంగా రూ. 1,002.50 వద్ద ఉంది.
హోటళ్లు, రెస్టారెంట్లలో వాడే కమర్షియల్ గ్యాస్ ధర హైదరాబాద్‌లో రూ. 2,105.50 కు చేరింది. ఢిల్లీలో రూ. 1,884.50, ముంబైలో రూ. 1,836, కోల్‌కతాలో రూ. 1,988.50, చెన్నైలో రూ. 2,043.50 గా ఉంది. మధ్యప్రాచ్య దేశాల్లో యుద్ధ వాతావరణం, అంతర్జాతీయంగా ఇంధన ధరలు పెరగడమే ఈ సరఫరా ఇబ్బందులకు, ధరల పెంపునకు ప్రధాన కారణం. అక్రమ నిల్వలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.
తాజావార్తలు
-
Mahesh Kumar Goud : బీఆర్ఎస్ అప్పులపై మహేష్ గౌడ్ సవాల్.. ‘చర్చకు వస్తారా?’
-
Abhijeet Dipke Controversy: రామ మందిర CEOపై తప్పుడు వీడియో.. అభిజీత్ దీప్కేపై విమర్శలు..
-
Vaibhav Sooryavanshi: చిన్న వయసులోనే ఊహించని పాపులారిటీ.. వైభవ్ వైభవ్ అంటూ మాస్ మేనియా..
-
India Diesel Exports: రష్యా, అమెరికాను వెనక్కి నెట్టి.. యూరప్ డీజిల్ సరఫరాలో భారత్ టాప్
-
Nepal Earthquake: ఓ వైపు వరద విలయం.. నేపాల్‌లో భూకంపం..
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!