Site icon NTV Telugu

Miyapur Lover Attack: మియాపూర్ లో దారుణం.. ప్రియురాలు, తల్లిపై దాడి

Kims

Kims

రంగారెడ్డి జిల్లా మన్నెగూడలో డాక్టర్ వైశాలిపై దాడి, కిడ్నాప్ కేసు మరిచిపోకముందే మరో దారుణం వెలుగులోకి వచ్చింది. మియాపూర్ ఆదిత్య నగర్ లో ప్రియుడు రెచ్చిపోయాడు. ప్రియురాలు, తల్లిని కత్తితో పొడిచిన ప్రియుడు సందీప్ అక్కడినించి వెళ్లిపోయాడు. అనంతరం తాను కూడా గాయపరుచుకున్నాడు. తీవ్ర గాయాల పాలైన ప్రియురాలు, తల్లిని కొండాపూర్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రేమ వ్యవహారమే గొడవకు కారణంగా భావిస్తున్నారు పోలీసులు… కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.ఈ ఘటన కలకలం రేపింది.

ప్రేమ వ్యవహారమే ఈ దాడులకు కారణంగా భావిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. గుంటూరు కు చెందిన యువతి(19) సందీప్ గత 3 సంవత్సరాల నుండి ప్రేమించుకుంటున్నారు. రెండేళ్ల నుంచి సందీప్‌ను దూరంగా పెడుతుంది బాధిత యువతి.దీంతో వేరు వేరు నంబర్‌ల నుంచి ఆ అమ్మాయికి తరచూ ఫోన్ కాల్స్ చేస్తూ వేధిస్తున్నాడు నిందితుడు సందీప్. నిన్ను చంపేసి తను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తూ మెసేజ్‌లు పంపుతున్నాడు సందీప్. దీంతో ఆ యువతి బాగా డిస్ర్టబ్ అయింది. ఈరోజు ఉదయం 10:30గంటల ప్రాంతంలో మియపూర్ లోని బాధిత ఇంటికి వచ్చిన సందీప్ ఈ దారుణానికి ఒడిగట్టాడు.

Read Also: Virupaksha: సాయి ధరమ్ తేజ్ కోసం ఎన్టీఆర్ లా మారే హీరోలు ఎవరు?

యువతి తల్లి శోభతో గొడవపడి ఇద్దరిపై కత్తితో దాడి చేశాడు సందీప్. తర్వాత తను గొంతు కోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు సందీప్. గాయాలపాలైన యువతి, తల్లి శోభలను చికిత్స నిమిత్తం కొండాపూర్ లోని కిమ్స్ హాస్పిటల్ కు తరలించారు పోలీసులు. సందీప్ కు లోతైన గాయం కావడంతో గాంధీ హాస్పిటల్ కు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు మియపూర్ పోలీసులు.

Read Also: Payyavula Keshav: 30 రోజుల పాటు అసెంబ్లీని నిర్వహించే దమ్ముందా?

Exit mobile version