Kurnool Crime: కర్నూలు జిల్లాలో ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేగుతోంది.. మంత్రాలయం మండలం తుంగభద్ర రైల్వే స్టేషన్ లో జరిగిన ఈ ఘటనకు ప్రధాన కారణం.. వారి ఇద్దరి కులాలు వేరు కావడమే అంటున్నారు.. తుంగభద్ర రైల్వేస్టేషన్ సమీపంలో రెండు మృతదేహాలు పడిఉండడాన్ని గమనించిన స్థానికులు.. పోలీసులు సమాచారం చేరవేశారు.. దీంతో.. ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.. రెండు మృతదేహాలను ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.. మృతులు మంత్రాలయం మండలం రచ్చుమర్రికి చెందిన వెంకటేష్ (20) మంత్రాలయంకు చెందిన నందిని (19)గా గుర్తించారు పోలీసులు… గత కొంత కాలంగా వెంకటేష్, నందిని ప్రేమించుకోగా.. వారి వ్యవహారం కుటుంబ సభ్యుల వరకు వెళ్లింది.. అయితే, ఇద్దరి కులాలు వేరు కావడంతో పెళ్లికి నిరాకరించారు ఇరు కుటుంబాల పెద్దలు. దీంతో, విడిచి ఉండలేక, కలిసి బతకలేక.. ఇద్దరం కలిసి చావాలనే నిర్ణయానికి వచ్చిన ఆ ప్రేమ జంట.. రైల్వే పట్టాలపై ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు భావిస్తున్నారు. కాగా, కొందరు ప్రేమించుకోవడం.. పెద్దలను ఒప్పించి పెళ్లిళ్లు కూడా చేసుకుంటుంటే.. మరికొందరు.. ఇలా ప్రాణాలు తీసుకుంటూ.. కన్నవారి ఆశలు అడియాశలు చేస్తున్నారు. ఎంతో విలువైన జీవితాన్ని.. ఆదిలోనే ముగించేస్తున్నారు.
Kurnool Crime: ప్రేమ జంట ఆత్మహత్య.. కులాలే ప్రాణం తీశాయి..!

Sucide