మన దేశంలో దేవుళ్లను ఎక్కువగా మన దేశంలో పూజిస్తారు..హిందువులు ఎక్కువగా కొలిచే దేవులలో పరమేశ్వరుడు కూడా ఒకరు. భారతదేశంలో కొన్ని వందల సంఖ్యలో శివాలయాలు ఉన్న విషయం అందరికీ తెలిసిందే.. ఈ భూమీద శివుడును ఎక్కువగా కొలుస్తారు.. అయితే శివుడును ఎక్కువగా లింగ రూపంలోనే కొలుస్తారు..సోమవారం శివునికి ఎంతో ప్రీతికరమైనది. ఆ రోజున భక్తులు ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తూ ఉంటారు. సోమవారం రోజున శివునికి ఇష్టమైన ఆహార పదార్థాలతో పాటుగా, స్వామి వారికి ఎంతో ఇష్టమైన పూలతో కూడా పూజిస్తూ ఉంటారు..
ఎవ్వరికి తెలియని మరో పువ్వు ఒకటి ఉంది.. ఈ పువ్వుతో పూజిస్తే శివయ్య అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.. అయితే శివుడుకు ఇష్టమైన పువ్వు మరేదో కాదు.. ఉమ్మేత్త..కేరళ లోని శివుని ఆలయాల్లో ఉమ్మెత్త పువ్వులతో అభిషేకం ప్రత్యేకంగా జరుగుతుంది. మాంగల్య భాగ్యం లభించాలంటే శివుడిని ఉమ్మెత్త పువ్వులతో అర్చించాలి అని అక్కడ బాగా నమ్ముతారు. ఉమ్మెత్త పువ్వులతో తయారు చేసిన మాలను శివుడికి అర్చించడం వల్ల మనం కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. ఇక వినాయకుడికి కూడా ఉమ్మెత్త పువ్వులంటే చాలా ఇష్టం. అలాగే దుర్గాదేవిని ఉమ్మెత్త పూలతో పూజిస్తే దారిద్ర్యం తొలగిపోతుందట. నవరాత్రి రోజుల్లో ఏడవరోజు సరస్వతీ దేవీ అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తారు… అప్పుడే ఈ పూలతో ప్రత్యేకంగా పూజిస్తారు..
ఆ పూలతో శివయ్యను పూజించడం వల్ల దరిద్రం పోవడం మాత్రమే కాదు ఎటువంటి దోషాలు ఉన్నా కూడా తొలగి పోతాయి..అమావాస్యకు, పౌర్ణమికి ఒక్క రోజు ముందు ప్రదోషం వస్తుంది. ఈ సమయంలో శివుడిని దేవతలు స్తుతిస్తారని విశ్వాసం. ఆ సమయంలో శివునిని దర్శించుకుంటే శివుని అనుగ్రహంతో పాటు సమస్త దేవతల అనుగ్రహం లభిస్తుంది. ప్రదోషం రోజున సాయంత్రం 4 నుంచి 6 గంటల సమయంలో నందీశ్వరుడిని పూజించాలి..అప్పుడే దోషాలు తొలగిపోతాయి.. సుఖ సంతోషాలు వెల్లువిరుస్తాయి.. అందుకే ఉమ్మేత్త పూలతో ఒకసారి శివయ్యను పూజించి ఫలితాలు ఎలా ఉన్నాయో మీరే చూడండి..