Loksatta: రాష్ట్రంలో ఓటర్ల తొలగింపుపై ‘ఓట్ ఇండియా – సేవ్ డెమోక్రసీ’ పేరుతో లోక్‌సత్తా ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. విజయనగరంలోని మయూరా హోటల్ కాన్ఫిరెన్స్ హాల్‌లో పార్టీ వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. ఎన్నికల్లో గెలవటమే కాకుండా., ప్రజల సంక్షేమం గురించి కూడా పార్టీలు ఆలోచించాలని జయప్రకాష్ నారాయణ్ అన్నారు. ఓటర్ల జాబితా ప్రక్షాళన చేయాలన్నారు.
Also Read: KCR Maharashtra Tour: రేపు మహారాష్ట్రకు సీఎం కేసీఆర్.. రెండు రోజుల పర్యటన వివరాలు
ఇటీవల రాష్ట్రంలో ఓటర్ల తొలగింపు ఆందోళన కలిగిస్తోందని.. ఈ నేపథ్యంలో లోక్‌సత్తా దేశవ్యాప్త ఉద్యమానికి నడుం బిగించిందని ఆయన చెప్పారు. ఓటర్ల తొలగింపుపై సర్వేతో పాటు., ప్రజల్లో అవగాహన కల్పిస్తామని వెల్లడించారు. ఓటర్ల జాబితాలో ఓట్ల తొలగింపుపై కేవలం ఆరోపణలు చేయడం కాకుండా., వాస్తవ పరిస్థితులను పరిశీలించాలని నిర్ణయించామన్నారు. ఈ ఉద్యమానికి అందరూ నడుం బిగించాలని., యువత, ప్రజలు స్వచ్చందంగా ముందుకు రావాలని లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ సూచించారు.