తమిళ్ లో ఇప్పుడు స్టార్ దర్శకుడు మరో మాట లేకుండా చెప్పే పేరు లోకేష్ కనకరాజ్. ఖైదీ, విక్రమ్, మాస్టర్, లియో సినిమాలతో అగ్ర దర్శకుడిగా మారాడు. మనోడితో సినిమాలు చేసేందుకు ఎగబడుతున్నారు స్టార్ హీరోలు. ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా ‘కూలీ’ సినిమాను తెరకెక్కించాడు. ఇండియాస్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ గా వస్తున్నఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నెల 14న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కు రెడీ అవుతోంది.
Also Read : Bollywood : షాహీద్ కపూర్ వర్సెస్ రణవీర్ సింగ్.. మధ్యలో ప్రభాస్.. గెలుపెవరిది
ఈ నేపధ్యంలో పలు మీడియాలతో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాడు. తాజాగా ఓ ప్రెస్ మీట్ లో ‘విజయ్, కమల్ హాసన్, రజనీకాంత్ వంటి స్టార్ హీరోలను డైరెక్ట్ చేసిన మీరు ఇప్పుడు మీ నెక్ట్స్ సినిమాను టైర్ 2 హీరో అయిన కార్తీ తో ఖైదీ 2 ను తెరకెక్కిస్తున్నాను అని చెప్పారు. అందుకు మీరు రిగ్రెట్ గా ఫీల్ అవుతున్నారా అని లోకేష్ ను ప్రశ్నించాడు ఓ మీడియా ప్రతినిది. ఆ స్టుపిడ్ ప్రశ్నకు హుందాగా బదులిచ్చిన లోకేష్’ నాతో ఎవరు లేనప్పుడు నన్ను నమ్మి నా టాలెంట్ ను ప్రపంచానికి పరిచయం చేసింది కార్తీ. నా వరకు కార్తీ ఓక సూపర్ స్టార్. ఖైదీ సినిమా టైమ్ లో ఆయన నన్ను నమ్మారు. దాని వల్లే నేను ఈ రోజు ఇక్కడ ఉన్నాను. నేను బలంగా చెప్తున్నా ఖైదీ 2 తో కార్తీకి భారీ హిట్ ఇస్తాను’ అని అన్నారు. ఒక స్టుపిడ్ క్వశ్చన్ కి సూపర్ గా సమాధానం ఇచ్చావ్ లోకేష్ అని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.
