తమిళ్ లో ఇప్పుడు స్టార్ దర్శకుడు మరో మాట లేకుండా చెప్పే పేరు లోకేష్ కనకరాజ్. ఖైదీ, విక్రమ్, మాస్టర్, లియో సినిమాలతో అగ్ర దర్శకుడిగా మారాడు. మనోడితో సినిమాలు చేసేందుకు ఎగబడుతున్నారు స్టార్ హీరోలు. ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా ‘కూలీ’ సినిమాను తెరకెక్కించాడు. ఇండియాస్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ గా వస్తున్నఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నెల 14న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కు రెడీ అవుతోంది. Also Read…