NTV Telugu Site icon

AP Lokayukta: 60 ఏళ్ల వివాదానికి లోకాయుక్త జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి పరిష్కారం

Ap Lokayukta

Ap Lokayukta

AP Lokayukta: ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కానీ కేసును చాలా తక్కువ సమయంలో పరిష్కరించారు ఏపీ లోకాయుక్త జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి . 60 ఏళ్ల వివాదానికి లోకాయుక్త జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి పరిష్కారం చూపించారు. 1962లో భర్త మృతితో పెన్షన్ కోసం 60 ఏళ్లుగా పోరాడుతున్న తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కృష్ణవేణికి న్యాయం జరిగేలా తీర్పును ఇచ్చారు. 60 ఏళ్లుగా పరిష్కారం కాకపోవడంతో ఆమె 2021 లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. విచారణకు స్వీకరించిన జస్టిస్ లక్షణ రెడ్డి.. 60 ఏళ్ల పెన్షన్ రూ.15.70 లక్షల బకాయిలతో సహా పెన్షన్ చెల్లించాలని కాకినాడ ట్రెజరీ అధికారులకు ఆదేశించారు. రూ.15.70 లక్షలను ట్రెజరీ అధికారులు ఆమెకు చెల్లించారు. 60 ఏళ్లుగా పోరాడిన ఆమెకు న్యాయం జరగడంతో ఆమె ఆనందం వ్యక్తం చేశారు.

Read Also: Gorantla Madhav: పార్లమెంట్‌లో దాడి.. ఎంపీ గోరంట్ల మాధవ్ సాహసం

ఏపీ లోకాయుక్త న్యాయమూర్తి జస్టిస్‌ లక్ష్మణ్‌ రెడ్డి గతంలోనే అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. ఆయన నాలుగేళ్లలో లోకాయుక్తకు అందిన ఫిర్యాదుల్లో 9,141 కేసులు విచారణ చేశారు.. అలాగే తీర్పులు వెల్లడించారు. 2019 సెప్టెంబరు 15న ఆంధ్రప్రదేశ్‌ లోకాయుక్తగా జస్టిస్‌ లక్ష్మణరెడ్డి బాధ్యతలు చేపట్టారు. డిప్యూటీ లోకాయుక్త పోస్టులో ప్రభుత్వం ఎవరినీ నియమించకపోవడంతో ఆ బాధ్యతలనూ ఆయనే నిర్వర్తించారు. ఇలా లోకాయుక్త కార్యాలయానికి వచ్చిన ఫిర్యాదులను సాంకేతికంగా రెండు రకాలుగా విభజించినా తీర్పులు మాత్రం ఒక్కరే ఇచ్చారు. జస్టిస్‌ లక్ష్మణరెడ్డి 2020లో 1,928, 2021లో 2,307, 2022లో 2,874, 2023లో 2వేలకు పైగా కేసుల్లో తీర్పులు వెల్లడించారు.