దేశంలోనే అతి పెద్ద పార్లమెంట్ నియోజకవర్గమైన మల్కాజిగిరి మరో రికార్డు సృష్టించింది. రాష్ట్రంలో ఈనెల 25న నామినేషన్ల ప్రక్రియ ముగిసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని 17 లోక్ సభ నియోజకవర్గాలకు సంబంధించి 893 మంది అభ్యర్థులు 1488 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల పరిశీలన ప్రక్రియ నేడు కొనసాగుతోంది. ఈనెల 29 వరకు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగనుంది. మల్కాజిగిరి లోక్ సభ స్థానానికి అత్యధికంగా 114 మంది అభ్యర్థులు 177 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. రాజధాని పరిధిలోని హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ల ఎంపీ స్థానాలకు మొత్తంగా 316 నామినేషన్లు దాఖలు అయ్యాయి. మల్కాజిగిరి ఎంపీ స్థానానికి చివరి రోజు 61 మంది అభ్యర్థుల 91 సెట్ల నామినేషన్లు అందజేశారు. ఇందులో ఇన్ని నామినేషన్లు తిరస్కరించబడతాయో కాసేపట్లో తేలనుంది.
READ MORE: T20 WC 2024: టీ20 వరల్డ్ కప్ లో కీలక బాధ్యతలు చేపట్టనున్న సిక్సర్ల కింగ్.. ఆఫీసియల్..
మల్కాజిగిరి స్థానంలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య గట్టి పోటీ ఉండబోతోంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ తరఫున పట్నం సునీతారెడ్డి బరిలోకి దిగారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్నది తమ ప్రభుత్వమేనని ఇక్కడ కూడా తప్పకుండా గెలుస్తామని ఆమె ధీమా వ్యక్తం చేస్తురు. అదే స్థాయిలో ప్రచారం జోరుగా కొనసాగుతోంది. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి గెలిచి ఎంపీ అయిన రేవంత్ రెడ్డి ప్రస్తుతం ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు.మరోవైపు బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఇప్పటికే భారీ బహిరంగ సభ పెట్టారు. దేశ ప్రధాని మోదీ కూడా ప్రచారానికి హాజరయ్యారు. బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి పక్కా లోకల్ అంటూ.. మిగితా అభ్యర్థులకు ఈ నియోజకవర్గానికి సంబంధం లేదని చెబుతున్నారు. గెలిచిన ఓడిన ప్రజలతో ఉండేది తానే అంటూ ప్రజల్లోకి వెళ్తున్నారు.
L