Lok Sabha Elections 2024: తెలంగాణలో కాసేపట్లో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ముగియనుంది. అక్కడక్కడా చెదురు ముదురు ఘటనలు మినహా రాష్ట్రంలో పోలింగ్ కొనసాగింది. ఓటర్లు ఉత్సాహంగా తరలి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సాయంత్రం 5గంటల వరకు 61.16 శాతం పోలింగ్ నమోదైంది. ఈ మేరకు ఎన్నికల అధికారులు తెలిపారు. తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గంలో పోలింగ్ జరుగుతోంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. గత ఎన్నికల్లో కంటే ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో అధిక ఓటింగ్ శాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇంకా చాలా పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు బారులు తీరారు.
Read Also: Hyderabad: పాతబస్తీ మీర్ చౌక్ వద్ద ఉద్రిక్తత
లోక్‌సభ నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతాలు చూస్తే..
*ఆదిలాబాద్ -69.81 శాతం
*భువనగిరి -62.34 శాతం
*చేవెళ్ల -53.15 శాతం
*హైద్రాబాద్ -39.17 శాతం
*కరీంనగర్-67.67 శాతం
*ఖమ్మం-70.76 శాతం
*మహబూబాబాద్-68.60 శాతం
*మహబూబ్‌నగర్-68.40 శాతం
*మల్కాజిగిరి-46.27 శాతం
*మెదక్-71.33 శాతం
*నాగర్ కర్నూల్ -66.53 శాతం
*నల్గొండ-70.36 శాతం
*నిజామాబాద్-67.96 శాతం
*పెద్దపల్లి-63.86 శాతం
*సికింద్రాబాద్-42.48 శాతం
*వరంగల్-64.08 శాతం
*జహీరాబాద్-71.91 శాతం
సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం- 47.88 శాతం ఓటింగ్ నమోదు.