NTV Telugu Site icon

Sivakarthikeyan: ఓటు బుల్లెట్‌ కన్నా శక్తివంతమైనది: శివకార్తికేయన్

Sivakarthikeyan Vote

Sivakarthikeyan Vote

Sivakarthikeyan Cast HIs Vote For Tamil Nadu Lok Sabha Elections 2024: దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల తొలి దశ పోలింగ్‌ కొనసాగుతోంది. తొలి విడతలో భాగంగా 21 రాష్ట్రాల్లో 102 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్‌ మొదలైంది. మరోవైపు అరుణాచల్‌ ప్రదేశ్‌, సిక్కింలోని అసెంబ్లీ స్థానాల్లోనూ ఎన్నికలు జరుగుతున్నాయి. శుక్రవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా.. పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. తమిళనాడులో సాధారణ ప్రజలతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.

Also Read: Pushpa 2: ఆ భాషలో కూడా రిలీజ్ అవుతున్న ‘పుష్ప 2’!

కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్‌ ఓటు వేసేందుకు తన సతీమణితో కలిసి చెన్నై వలసరవక్‌లోని పోలింగ్ కేంద్రానికి వచ్చారు. అందరితో పాటు క్యూలైన్‌లో నిలబడిన శివకార్తికేయన్‌.. తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు వేసిన అనంతరం పోలింగ్ కేంద్రం నుంచి బయటకు వచ్చిన శివకార్తికేయన్‌.. మీడియాతో మాట్లాడారు. ‘ఓటు మనందరి హక్కు. ఓటు వేయడం మన విధి. తొలిసారి ఓటు వేస్తున్న వారికి నా అభినందనలు. వారు ఓ పండుగ తరహాలో జరుపుకోవచ్చు. ఎవరూ ఏం చెప్పినా.. మీ నచ్చిన వ్యక్తికి ఓటేయండి. ఓటు బుల్లెట్‌ కన్నా శక్తివంతమైనది. హాలిడే కదా అని ఇంట్లో ఉండకండి. ఓ అర్ధగంట ఓటు కోసం కేటాయిస్తే సరిపోతుంది. అందరూ తప్పక ఓటేయండి’ అని శివకార్తికేయన్‌ కోరారు.