దేశ భవిష్యత్ కోసం మోడీని మరోసారి గెలిపించాలని ప్రజలకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సికింద్రాబాద్‌లో కిషన్‌రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రధాని మోడీ దేశ భవిష్యత్‌ను మార్చే నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఓటింగ్ రోజున హాలీడ్ కాదని.. భవిష్యత్‌ను డిసైడ్ చేసే రోజు అని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Yarlagadda Venkatarao: గన్నవరం నియోజకవర్గంలో టీడీపీకి జనాధరణ పెరుగుతుంది.. గెలుపు ఖాయం
ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో మోడీ పెకిలించేశారన్నారు. కరోనా వచ్చినప్పుడు ఇండియా పేద దేశం.. దేశంలో ఒకరి మాట ఒకరు వినరు అని వేరే దేశాలు అనుకున్నాయని.. దేశంలో అనేక మంది చనిపోతారని అనుకున్నారని.. కానీ వ్యాక్సిన్ కనిపెట్టి దేశాన్ని కాపాడినట్లు చెప్పుకొచ్చారు. కరోనా నుంచి ప్రజల ప్రాణాలు రక్షించిన ఘనత మోడీకే దక్కుతుందన్నారు. తెల్ల రేషన్ కార్డు లేని వృద్ధులకు కూడా ఆయుష్మాన్ భారత్ ఇస్తామని ప్రకటించారు. మోడీకి పేరు వస్తుందేమోనని.. తెలంగాణలో ఆయుష్మాన్ భారత్‌ను కేసీఆర్ ఇవ్వలేదని ఆరోపించారు. జన ఔషధి కేంద్రాల్లో తక్కువ ధరకే మందులు ఇస్తున్నట్లు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Kakarla Suresh: కాకర్ల సురేష్కు మద్దతుగా ప్రచారం చేసిన కుటుంబ సభ్యులు..
తాను ప్రధాని అయితే రామ మందిర నిర్మాణం చేస్తానని మోడీ గ్యారెంటీ ఇచ్చారని.. ఒక్క రక్తపు బొట్టు చిందించకుండా రామాలయాన్ని నిర్మించారని గుర్తుచేశారు. ఇక అంతర్జాతీయ స్థాయిలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను నిర్మిస్తున్నట్లు వివరించారు. ప్రతి ఒక్కరిని లక్షాధికారిని చేసేలా మోడీ ప్లాన్ చేశారన్నారు. మోడీ నాయకత్వంలో దేశం ప్రాముఖ్యత పెరుగుతుందన్నారు. కాంగ్రెస్ అంటే అవినీతి, కుంభకోణాలు, దోపిడీ, కరెంట్ కోతలు, కుటుంబ పాలన అంటూ కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు.
ఇది కూడా చదవండి: Kodali Nani: 50 రోజుల్లో జగనే మళ్లీ సీఎం..