NTV Telugu Site icon

Bengal Train Accident: బెంగాల్ రైలు ప్రమాద ఘటన.. మృతి చెందిన వారిలో లోకో పైలట్, సహాయకుడు

Bengal Train

Bengal Train

పశ్చిమ బెంగాల్‌లోని న్యూ జల్‌పైగురిలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. కాంచనజంగా ఎక్స్‌ప్రెస్‌ను గూడ్స్ రైలు ఢీకొట్టిన ఘటనలో ఇప్పటివరకు 8 మృతి చెందారు. అందులో ముగ్గురు రైల్వే సిబ్బంది ఉన్నారని రైల్వే అధికారులు తెలిపారు. చనిపోయిన వారిలో ఐదుగురు ప్రయాణికులు, ముగ్గురు రైల్వే సిబ్బంది ఉన్నారు. గూడ్స్ రేక్‌లోని లోకోమోటివ్ పైలట్, అసిస్టెంట్ లోకోమోటివ్ పైలట్, ఎక్స్‌ప్రెస్ రైలులోని గార్డు మరణించారు. దాదాపు 50 మంది ప్రయాణికులు గాయపడ్డారు. అయితే ఎక్స్‌ప్రెస్ రైలులోని చివరి రెండు కోచ్‌లు గార్డు కోచ్, కార్గో వ్యాన్ అని అధికారులు తెలిపారు. దాదాపు 200 మంది ప్రయాణికులు గాయపడినట్లు సమాచారం. కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్ సీల్దా వైపు వెళుతోంది. అంతలో వెనుక నుంచి గూడ్స్ రైలు ఢీకొంది. దీంతో ప్యాసింజర్ రైలులోని మూడు బోగీలు పట్టాలు తప్పాయి. ప్రస్తుతం సహాయక చర్యలు ముగిశాయి. ఈ ప్రమాదంతో కనీసం 10 రైళ్లను దారి మళ్లించారు.

Read Also: IIT Kharagpur: ఐఐటీ ఖరగ్‌పూర్ లో ఉరి వేసుకున్న విద్యార్థిని..

ఈ ప్రమాదంపై ఈశాన్య సరిహద్దు రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ సబ్యసాచి డి మాట్లాడుతూ.. ప్రమాదానికి గల కారణాలను పరిశీలిస్తున్నామని, కొన్ని రైళ్లను దారి మళ్లించినప్పటికీ, అలుబారి-సిలిగురి-న్యూ జల్‌పైగురి లైన్ ఉన్నందున రాకపోకలకు ఆటంకం ఉండదని చెప్పారు. ఎంఎస్ సిన్హా మాట్లాడుతూ.. ఈ ఘటనపై విచారణ చేపడుతామని.. ఈ రైలు మార్గంలో కవాచ్ యాంటీ-కొలిజన్ సిస్టమ్‌ను అమలు చేయలేదని అంగీకరించారు. కేవలం ఢిల్లీ-గౌహతి మార్గంలో ప్లాన్ చేసినట్లు ఆమె తెలిపారు. గత ఏడాది జూన్‌లో ఒడిశాలోని బాలాసోర్‌లో ట్రిపుల్ రైలు ఢీకొన్న ఘటనలో 293 మంది మృతి చెందగా, 1,200 మందికి పైగా గాయపడిన తర్వాత దేశీయంగా అభివృద్ధి చెందిన కవాచ్ వ్యవస్థ లేకపోవడం గురించి కూడా చర్చ జరిగింది.

Read Also: Minister Satyakumar: రుయా ఆస్పత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి సత్యకుమార్