సంగారెడ్డి జిల్లాలోని మున్సిపాలిటీలో అసమ్మతి పోరు ముదురుతోంది. స్వపక్షంలోనే విపక్షంలా కౌన్సిలర్లు మారుతున్నారు. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లపై వరుసగా బీఆర్ఎస్ కౌన్సిలర్లు అవిశ్వాసాలు పెడుతున్నారు. నిన్న సంగారెడ్డి మున్సిపల్ చైర్ పర్సెన్ కి వ్యతిరేకంగా నోటీసులిచ్చారు కౌన్సిలర్లు. 24 గంటలు గడవకముందే జోగిపేట మున్సిపాలిటీలో అవిశ్వాస లొల్లి మొదలైంది. జోగిపేట మున్సిపల్ చైర్మన్ బాలయ్య, వైస్ చైర్మన్ ప్రవీణ్ కి వ్యతిరేకంగా కౌన్సిలర్లు గళం ఎత్తారు. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ లపై అవిశ్వాసం పెట్టె ఆలోచనలో కౌన్సిలర్లు ఉన్నట్లు తెలుస్తోంది. చిలిపిచెడ్ లోని చాముండేశ్వరి ఆలయంలో జోగిపేట మున్సిపల్ కౌన్సిలర్లు భేటీ అయ్యారు. గత మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 20 వార్డుల్లో 14 వార్డులను బీఆర్‌ఎస్ శ్రేణులు గెలుచుకున్నారు. అయితే.. ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ కి వ్యతిరేకంగా 11 మంది బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు గళం ఎత్తడంతో.. అవిశ్వాసానికి పరోక్షంగా కాంగ్రెస్ కౌన్సిలర్లు సహకరిస్తున్నట్లు సమాచారం. కౌన్సిలర్లకు ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ నచ్చజెప్పే ప్రయత్నం చేసినా.. ఎమ్మెల్యే మాట కౌన్సిలర్లు పక్కనపెట్టారు.
Also Read : BRS : బీఆర్‌ఎస్ నాందేడ్ సభకు సర్వం సిద్ధం
ఇదిలా ఉంటే.. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో మాజీ ఎమ్మెల్యే మదన్‌లాల్ కు అసమ్మతి సెగ ఎదురైంది. మదన్ లాల్ ఈరోజు కారేపల్లి మండలంలో పర్యటించి వివిధ సంఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించారు.. గ్రామాలలో పలు సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. పంతులు నాయక్ తండాలో ప్రజలు మదన్ లాల్ పై అసమ్మ తిని వ్యక్తం చేశారు. ఐదు సంవత్సరాల ఎమ్మెల్యేగా ఉన్న పిరియడ్లో తమ గ్రామానికి ఒరిగింది ఏమీ లేదని , ఇప్పుడెందుకు గ్రామానికి వస్తున్నారని పంతులు నాయక్ తండా ప్రజలు మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ను నిలదీశారు. తాము కూలీలు చేసి బతుకుతూ అనేక సమస్యలతో సతమాతమవుతున్నప్పటికీ తమను ఏనాడు ఆదుకోలేదని అన్నారు.మదన్ లాల్ ప్రజలకు ఏదో సమాధానం చెప్పి అక్కడినుండి వెళ్లిపోయారు.
Also Read : INDvsAUS Test: భారత్-ఆస్ట్రేలియా సిరీస్.. ఫ్రీగా ఎలా చూడొచ్చంటే?