NTV Telugu Site icon

Loan App Harassment: లోన్ యాప్ వేధింపులకు యువకుడు బలి.. పెళ్లయిన 40 రోజులకే..

Loan App

Loan App

Loan App Harassment: ఇటీవల కాలంలో లోన్‌ యాప్‌ల వేధింపులతో ఆత్మహత్యలు జరుగుతూనే ఉన్నాయి.. అవసరాల కోసం ఆన్‌లైన్‌ యాప్‌లను ఆశ్రయించిన ఘటనలు కొన్ని అయితే.. వారే పిలిచి మరి లోన్‌లు ఇచ్చి.. తర్వాత వేధింపులకు గురిచేసిన ఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి.. లోన్‌ ఇవ్వడం.. ఆ తర్వాత రకరకాలుగా వేధింపులకు గురి చేయడంతో.. ఇప్పటికే ఎంతో మంది ప్రాణాలు తీసుకున్నారు. తాజాగా లోన్‌ యాప్ వేధింపులకు ఓ యువకుడు బలి అయ్యాడు. ఈ ఘటన విశాఖలో చోటుచేసుకుంది.

Read Also: Medak: డ్వాక్రా డబ్బుతో మహిళ పరార్.. రుణాలు చెల్లించాలని బాధితులకు బ్యాంకు నోటీసులు

లోన్‌ యాప్ వేధింపులు భరించలేక పెళ్లయిన 40 రోజులకే యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మహారాణిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. రూ.2 వేల కోసం యువకుడి ఫోటోలను మార్ఫింగ్‌లు చేసి బెదిరింపులకు పాల్పడినట్లు తెలిసింది. ఆ మార్ఫింగ్ ఫోటోలను స్నేహితులకు, బంధువులకు లోన్‌ యాప్ నిర్వాహకులు పంపారు. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన నరేంద్ర(21) ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. మహారాణిపేట పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. లోన్ యాప్స్.. సైబర్ నేరాల నుంచి జాగ్రత్త వహించాలని.. అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.