Site icon NTV Telugu

Flop Star : ప్లాప్ స్టార్ కు కథ చెప్పిన లిటిల్ హార్ట్స్ డైరెక్టర్?

Nithiin

Nithiin

యంగ్ హీరో నితిన్ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా డజను డిజాస్టర్స్ తో ఇండస్ట్రీ రికార్డు కొట్టాడు. నితిన్ హిట్ సినిమాలు ఏవి అంటే వేళ్ళ మీద లెక్కపెట్టొచ్చు. భీష్మ తర్వాత నితిన్ సినీ కెరీర్ మరింత డౌన్ ఫాల్ అయింది. భారీ ఖర్చు చేసిన రాబిన్ హుడ్ డిజాస్టర్ అవగా ఎన్నో ఆశలు పెట్టుకున్న తమ్ముడు కూడా డిజాస్టర్ అయి కూర్చుంది.

Also Read : Mitra Mandali : నన్ను తొక్కాలి అనుకుంటే.. మీరు నా వెంట్రుక కూడా పీకలేరు : బన్ని వాసు

దాంతో నితిన్ చేస్తున్న నెక్ట్స్ సినిమాలపై ఆ ప్రభావం గట్టిగా పడింది. బలగం వేణు డైరెక్షన్ లో చేయాల్సిన ఎల్లమ్మ ఇప్పుడు బెల్లం కొండ వద్దకు చేరిందని టాక్. ఇంతటి డిజాస్టర్ స్టార్ గా రికార్డ్ ఉన్న నితిన్ కు ఉపశమనం కలిగించే న్యూస్ ఒకటి టాలీవుడ్ సిర్కిల్స్  వినిపిస్తోంది. టాలీవుడ్ లో చిన్న సినిమాగా రిలీజ్ అయి పెద్ద హిట్ అందుకున్న సినిమా లిటిల్ హార్ట్స్. సాయి మార్తాండ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా అనూహ్య విజయం సాధించి భారీ వసూళ్లు సాధించింది. ఇప్పుడు ఈ సినిమా దర్శకుడు తన నెక్ట్స్ సినిమాను యంగ్ హీరో నితిన్ తో చేసేందుకు రెడీ అవుతున్నాడట. ఇటీవల నితిన్ ను కలిసి కథ వినిపించాడని అందుకు నితిన్ కూడా గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడని టాక్. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తోంది. మరి వరుస డిజాస్టర్స్ తో డీలా పడిన నితిన్ కు లిటిల్ హార్ట్స్ డైరెక్టర్ సాయి మార్తాండ్ హిట్ ఇస్తాడో లేదో చూడాలి.

Exit mobile version