NTV Telugu Site icon

AP Elections 2024: ఎన్నికల వేళ ఏపీలో భారీగా పట్టుబడుతున్న మద్యం, డబ్బు, గంజాయి..

Ap Elections

Ap Elections

ఏపీలో కరెన్సీ నోట్లకు రెక్కలొచ్చాయి. ఎన్నికలకు ఇంకా నెల రోజుల సమయం ఉండటంతో పార్టీలు, అభ్యర్థులు స్పీడ్ పెంచారు. ఈ క్రమంలో.. ఓటర్లను ఆకర్షించేందుకు సిద్ధమవుతున్నారు. ఇన్నాళ్లు కలుగుల్లో దాచిపెట్టిన డబ్బులను బయటకు తీస్తున్నారు. బినామీల చేతుల మీదుగా కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయి. అక్కడక్కడ తనిఖీల్లో దొరికిందే కొంత.. ఇంకా దొరకని సొమ్ము వందల కోట్లలో ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఎన్నికల్లో నగదు ప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకు ఎన్నికల కమిషన్ కూడా కొరడా ఝులిపిస్తుంది.

Read Also: Undi TDP: రచ్చకెక్కిన ఉండి టీడీపీ టికెట్ అభ్యర్థి మార్పు వ్యవహారం..

బస్సులు, లారీలు, కార్లు, ఆటోలు, షిప్ లతో పాటు ఇతర వాహనాల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీ చేస్తున్నారు. ఏపీలో షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకూ రూ. 100 కోట్ల నగదు పట్టుబడింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.. ఏ స్థాయిలో ప్రలోభాలు జరుగుతున్నాయన్నది. ఒక్క నగదే కాదు.. మద్యం కూడా ఏరులైపారుతుంది. ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి కూడా సరఫరా చేస్తుండగా.. పోలీసులు పట్టుకుని సీజ్ చేశారు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ఇతర రాష్ట్రాల నుంచి కొందరు నేతలు మద్యం తీసుకొస్తున్నారు. ఇప్పటివరకు పట్టుబడ్డ మద్యం విలువను లెక్కకట్టే పనిలో పడ్డారు మద్యం శాఖ.

Read Also: Upi Payments: ఇంటర్నెట్ లేకున్నా పేమెంట్స్ చెయ్యొచ్చు.. ఎలాగంటే?

Show comments