NTV Telugu Site icon

AP Liquor Shops: ప్రశాంతంగా ముగిసిన మద్యం దుకాణాల కేటాయింపు.. లాటరీలో మహిళల హవా

Andhra Pradesh

Andhra Pradesh

AP Liquor Shops: ఏపీ వ్యాప్తంగా మద్యం దుకాణాల కేటాయింపు ప్రశాంతంగా ముగిసింది. లాటరీ విధానం ద్వారా దరఖాస్తుదారులకు షాపుల కేటాయింపు జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 3396 దుకాణాల లాటరీ ద్వారా కేటాయింపు కోసం మొత్తం 89, 882 దరఖాస్తులు రాగా.. లాటరీ ప్రక్రియ సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. కాగా.. పూర్తి బందోబస్తు నడుమ నిర్వహించిన ఈ లాటరీ కొన్ని ప్రాంతాల్లో ఎన్నికలను తలపించింది. ఉదయం నుంచి నిరాటంకంగా జరిగి లాటరీ విధానాన్ని మధ్యాహ్నం 3 గంటలకు పూర్తి అయింది. ఢిల్లీ, మహారాష్ట్ర, తెలంగాణ, యూపీ రాష్ట్రాల నుంచి టెండర్లు వేసి వ్యాపారులు షాపులను దక్కించుకున్నారు.

Read Also: Minister Narayana: ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలి.. తుఫాన్ పరిస్థితులపై మంత్రి నారాయణ సమీక్ష

అధికార పార్టీ ఎమ్మెల్యేల అనుచరులకు 3 నుంచి 5 వరకు షాపులు దక్కినట్లు సమాచారం. 50 నుంచి 100 షాపులకు దరఖాస్తులు చేసిన సిండికేట్‌కు ఐదు నుంచి 10 షాపులు దక్కినట్లు తెలిసింది. విశాఖ, విజయవాడ, కృష్ణ వంటి పలు జిల్లాల్లో మద్యం దుకాణాలను మహిళలు చేజిక్కించుకున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో 16, కృష్ణా జిల్లాలో ఏడు, విశాఖ జిల్లాలో 11 షాపులను మహిళా మణులు కైవసం చేసుకున్నారు. సిండికేట్‌గా ఏర్పడి 10 నుంచి 30 వరకు షాపులు వేసినా అదృష్టం తలుపు తట్టకపోవడంతో కొంతమంది దరఖాస్తుదారులు నిరాశతో వెనుదిరిగారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు షాపుల కేటాయింపు ప్రక్రియ కొనసాగింది.

ఇవాళ షాపు పొందిన వారి నుంచి డబ్బు కట్టించుకొని అధికారులు ప్రొవిజనల్ లైసెన్స్ ఇస్తున్నారు. రేపు సాయంత్రం నుంచి డిపోలో స్టాక్ తీసుకొని 16వ తారీఖున దుకాణాలను వ్యాపారులు తెరవనున్నారు. రేపు సాయంత్రం వరకు ప్రభుత్వ మద్యం దుకాణాలు నడవనున్నాయి. అనంతరం షాపులు దక్కించుకున్నవారు మద్యం అమ్మకాలను జరపనున్నారు.