AP Liquor Shops: ప్రశాంతంగా ముగిసిన మద్యం దుకాణాల కేటాయింపు.. లాటరీలో మహిళల హవా
- ఏపీ వ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసిన మద్యం దుకాణాల కేటాయింపు
- లాటరీ విధానం ద్వారా దరఖాస్తుదారులకు షాపుల కేటాయింపు
- రాష్ట్ర వ్యాప్తంగా 3396 దుకాణాలు లాటరీ ద్వారా కేటాయింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Liquor Shops: ఏపీ వ్యాప్తంగా మద్యం దుకాణాల కేటాయింపు ప్రశాంతంగా ముగిసింది. లాటరీ విధానం ద్వారా దరఖాస్తుదారులకు షాపుల కేటాయింపు జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 3396 దుకాణాల లాటరీ ద్వారా కేటాయింపు కోసం మొత్తం 89, 882 దరఖాస్తులు రాగా.. లాటరీ ప్రక్రియ సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. కాగా.. పూర్తి బందోబస్తు నడుమ నిర్వహించిన ఈ లాటరీ కొన్ని ప్రాంతాల్లో ఎన్నికలను తలపించింది. ఉదయం నుంచి నిరాటంకంగా జరిగి లాటరీ విధానాన్ని మధ్యాహ్నం 3 గంటలకు పూర్తి అయింది. ఢిల్లీ, మహారాష్ట్ర, తెలంగాణ, యూపీ రాష్ట్రాల నుంచి టెండర్లు వేసి వ్యాపారులు షాపులను దక్కించుకున్నారు.
Read Also: Minister Narayana: ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలి.. తుఫాన్ పరిస్థితులపై మంత్రి నారాయణ సమీక్ష
Also Read
- IND vs SL: సచిన్, సెహ్వాగ్, ధోనీ, రోహిత్ వల్ల కూడా కాలేదు.. భారత్-శ్రీలంక టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదింది ఇతడే..
- కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
- ఏఐ, ఐటీ కోర్సులకు ఫుల్ డిమాండ్.. TG EAPCET 2026 ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి..
- Terror Modules: జంతర్ మంతర్ నిరసనల్లో టెర్రరిస్ట్‌లు.. 9 మంది పాకిస్థాన్ ఐఎస్ఐ ఉగ్రవాదులు అరెస్ట్
అధికార పార్టీ ఎమ్మెల్యేల అనుచరులకు 3 నుంచి 5 వరకు షాపులు దక్కినట్లు సమాచారం. 50 నుంచి 100 షాపులకు దరఖాస్తులు చేసిన సిండికేట్‌కు ఐదు నుంచి 10 షాపులు దక్కినట్లు తెలిసింది. విశాఖ, విజయవాడ, కృష్ణ వంటి పలు జిల్లాల్లో మద్యం దుకాణాలను మహిళలు చేజిక్కించుకున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో 16, కృష్ణా జిల్లాలో ఏడు, విశాఖ జిల్లాలో 11 షాపులను మహిళా మణులు కైవసం చేసుకున్నారు. సిండికేట్‌గా ఏర్పడి 10 నుంచి 30 వరకు షాపులు వేసినా అదృష్టం తలుపు తట్టకపోవడంతో కొంతమంది దరఖాస్తుదారులు నిరాశతో వెనుదిరిగారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు షాపుల కేటాయింపు ప్రక్రియ కొనసాగింది.
ఇవాళ షాపు పొందిన వారి నుంచి డబ్బు కట్టించుకొని అధికారులు ప్రొవిజనల్ లైసెన్స్ ఇస్తున్నారు. రేపు సాయంత్రం నుంచి డిపోలో స్టాక్ తీసుకొని 16వ తారీఖున దుకాణాలను వ్యాపారులు తెరవనున్నారు. రేపు సాయంత్రం వరకు ప్రభుత్వ మద్యం దుకాణాలు నడవనున్నాయి. అనంతరం షాపులు దక్కించుకున్నవారు మద్యం అమ్మకాలను జరపనున్నారు.
తాజావార్తలు
-
Ramayana: ‘రామాయణం’ ట్రైలర్లో హనుమంతుడు ఎందుకు కనిపించలేదు?.. క్లారిటీ ఇచ్చిన రణబీర్ కపూర్!
-
IND vs SL: సచిన్, సెహ్వాగ్, ధోనీ, రోహిత్ వల్ల కూడా కాలేదు.. భారత్-శ్రీలంక టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదింది ఇతడే..
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
ఏఐ, ఐటీ కోర్సులకు ఫుల్ డిమాండ్.. TG EAPCET 2026 ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి..
-
Dhsnudh-Sivakarthikeyan : ధనుష్, శివకార్తికేయన్ సీక్వెల్స్ సినిమాలపై కోలీవుడ్‌లో భారీ హైప్
ట్రెండింగ్
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్‌ప్లే, పాప్-అప్ డిజైన్‌తో Lava Probuds Xplore 25° TWS ఇయర్‌బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!