Viral Video: మీరు సింహాలయ్యా.. అలా భయపడితే ఎలా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lions Give Side to Rhinos: సాధారణంగా అడవి రాజు సింహం. ఇది మనందరికి చిన్నప్పటి నుంచి తెలిసిందే. ఏ జంతువులైనా సింహాన్ని చూస్తే గడగడలాడాల్సిందే. పక్కకు పారిపోవాల్సిందే. అయితే ఇప్పుడు సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక రకరకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. వాటిని చూస్తుంటే నిజంగా సింహాలేనా ఇలా చేస్తుంది అని ఆశ్చర్యం వేస్తుంది. సింహం అసలు తన దగ్గరకు ఎవరైనా వస్తేనే పంజాతో ఒక్కటిచ్చి పళ్లతో చీల్చి ముక్కలు ముక్కలు చేస్తుంది. అలాంటి ఈ మధ్య కొన్ని వీడియోలో ఓ యువతి ఫుడ్ షేర్ చేసుకోవడం చూశాం. అంతేనా సింహాల మధ్యలో కూర్చొని వాటినే కొట్టడం చూశాం. అంతేనా మొన్నీమధ్య ఓ చిన్న జీవి తాబేలు సింహం ప్లేట్ లో ఉంచిన మాంసాన్ని దానితో కలిసి కూర్చొని తినడం చూశాం. ఇక ఇప్పుడు కూడా సింహాల స్వభావానికి విరుద్ధమైన రెండు వీడియోలు వైరల్ అవుతున్నాయి.
Also Read: G20 Summit: భారత్ బయలుదేరిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. ఢిల్లీ వీధుల్లో తిరగనున్న ‘ది బీస్ట్’!
మొదటి వీడియోలు రెండు సింహాలు పడుకొని ఉంటాయి. అయితే ఆ దారిలో రెండు ఖడ్గమృగాలు వస్తూ ఉంటాయి. సాధారణంగా సింహాలు వస్తుంటే ఏ జంతువులైనా సైడ్ ఇవ్వాలి. కానీ వాటిని చూసి సింహాలే దారి ఇచ్చి పక్కకు జరిగాయి. దీకిని సంబంధించిన వీడియోను సుశాంత నందా అనే వ్యక్తి తన ఎక్స్(ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేస్తూ ఎప్పుడు అడవికి పులులు, సింహాలకే రాజులు కాదు పరిస్థితులు దానిని నిర్ణయిస్తాయి అని క్యాప్షన్ జోడించారు.
Also Read
- AP MPP Election Results: ఎంపీపీ ఎన్నికల్లో పార్టీల బలమెంత? అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాల పూర్తి లెక్కలివే!
- Suryakumar Yadav: "ప్రధాని మోడీని కలిశాకే నా లక్ మారింది.. మళ్లీ ఫామ్‌లోకి వచ్చా".. సూర్యకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- Koti Deepotsavam 2026 Day 7: కార్తీక శుక్రవారం.. ప్రబోధిని ఏకాదశి.. కోటి దీపోత్సవంలో నేటి విశేషాలివే!
- Cyclone Akvan: అక్వాన్ తీవ్ర తుపాన్ తీరం దాటే ప్రక్రియ ప్రారంభం.. వణుకుతున్న ఉత్తరాంధ్ర.. కీలక హెచ్చరిక!
ఇక మరో వీడియోలో ఓ పెద్ద ఏనుగు నెమ్మదిగా నడుచుకుంటూ వస్తుంది. అయితే సింహానికి అలా ఒంటరిగా ఏనుగు చిక్కితే అది ఎంత పెద్దది అయినా దానిని ఒక్క దెబ్బతో కింద పడేసి దాని కడుపు నింపుకుంటుంది. అలాంటి ఏనుగును చూసి ఆ సింహం ఒక్కసారిగా పరుగులు పెట్టింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. లార్డ్ ఆఫ్ జంగిల్, కింగ్ ఆఫ్ ఫారెస్ట్ గొడవను వద్దనుకున్నాయి. అందుకే వెళ్లడానికి ఒక దానికి మరొకటి దారి ఇచ్చిందని క్యాప్షన్ జోడించి రమేష్ పాండే అనే యూజర్ ఎక్స్( ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేశారు.
- Tags
- lion
- Rhino
- Trendy Video
- viral video
తాజావార్తలు
-
Ram Nithin: రామ్ నితిన్ కొత్త మూవీ.. ఇద్దరు అందాల భామలతో క్రేజీ ప్రాజెక్ట్!
-
Rohit Sharma: ఆ ఫోన్ కోసం గంటల తరబడి ఎదురుచూశా.. కునుకు పట్టలేదు.. చివరకు..!
-
Motorola Razr Flex 2027: 12GB RAM, 50MP కెమెరా, 165Hz డిస్ప్లే.. Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చేస్తోంది!
-
AP MPP Election Results: ఎంపీపీ ఎన్నికల్లో పార్టీల బలమెంత? అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాల పూర్తి లెక్కలివే!
-
Copper Prices: బంగారం, వెండి బాటలోనే రాగి.. ఇక ఏసీలు, ఫ్రిడ్జ్‌లు చౌకగా దొరుకుతాయా?
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!