మీ మొబైల్ నంబర్ ఆధార్ కార్డు నంబర్ తో, ఈ-మెయిల్ ఐడీ లింక్ అయ్యాయా ? లేదా ? దీనిపై ఏమైనా డౌట్ ఉంటే చెక్ చేసుకునే అవకాశాన్ని భారతీయ విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ కల్పిస్తోంది. మీరు UIDAI అధికారిక వెబ్‌సైట్(https://myaadhaar.uidai.gov.in/) లేదా mAadhaar యాప్ లోకి వెళ్లి ‘వేరిఫై ఈమెయిల్/ మొబైల్ నంబర్ అనే పేరుతో కలిగిన ఫీచర్ ద్వారా ఆధార్ తో మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీ లింక్ అయ్యాయా ? లేదా ? అనేది మనం తెలుసుకోవచ్చు.
Also Read : Uttar Pradesh: తప్పతాగి పెళ్లికూతురుపై సిందూరం చల్లిన వరుడు.. చివరకు ఏం జరిగిందంటే..?
ఒకవేళ మీ మొబైల్ నంబర్ ఇప్పటికే ఆధార్ నంబర్ తో లింగ్ అయి ఉంటే UIDAI వెబ్‌సైట్ స్క్రీన్‌పై.. మీరు నమోదు చేసిన మొబైల్ నంబర్ ఇప్పటికే మా రికార్డ్‌లతో ధృవీకరించబడింది అనే మెసేజ్ స్క్రీన్ పై డిస్ ప్లే అవుతుంది. ఒకవేళ ఆ మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీలు మీ ఆధార్ కు లింక్ చేసి లేకుంటే.. వాటిని లింక్ చేయడానికి ఏం చేయాలి అనేది కూడా తెలియపరుస్తుంది. ఈమేరకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనను విడుదల చేసింది.
Also Read : Samyuktha Hegde : చీ..ఛీ.. అవకాశాల కోసం ఇంతలా దిగజారాలా.. హెగ్డేపై నెటిజన్స్ ట్రోలింగ్
ఒకవేళ ఫోన్ నంబర్ గుర్తుకు రాకపోతే.. మై ఆధార్ పోర్టల్ లేదా mAadhaar యాప్‌లోని వేరిఫై ఆధార్ ఫీచర్ లోకి వెళ్లి ఆధార్ రిజిస్ట్రేషన్ సమయంలో ఇచ్చిన మొబైల్ నంబర్ లోని చివరి మూడు అంకెలను ఎంటర్ చేస్తే చాలు. ఇప్పటివరకు ఆధార్ తో మొబైల్ నంబర్ లింక్ అయి లేకుంటే సమీపంలోని ఆధార్ కేంద్రాన్ని సందర్శించవచ్చు.
Also Read : KTR: నా కొడుకు టాలెంట్ చూసి షాక్ అయ్యా..
మీ ఫోన్ నంబర్ ను అప్‌డేట్ ఇలా చేసుకోవచ్చు…
1. ఫస్ట్ uidai.gov.inలోకి వెళ్లి లోకేట్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి, మీకు సమీపంలోని ఆధార్ కేంద్రాన్ని ఐడెంటిఫై చేసుకొండి.
2. అనంతరం ఆ ఆధార్ కార్డ్ సెంటర్‌కు వెళ్లండి.
మొబైల్ నంబర్‌ని మార్చడానికి లేదా అప్‌డేట్ చేయడానికి మీకు ఒక ఫారమ్ ఇస్తారు. దాన్ని ఫిల్ చేయాలి.
4. మీ వివరాలను ఆన్‌లైన్‌లో ఎంటర్ చేసి.. మరోసారి ఫింగర్ ప్రింట్ తీసుకుంటారు.
5. అప్‌డేట్ రిక్వెస్ట్ నంబర్ అంటే URN. మీకు URN స్లిప్‌ను ఇస్తారు. ఇందుకోసం రూ.50 రుసుం తీసుకుంటారు.
6. URN ద్వారా మీ ఆధార్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. myaadhaar.uidai.gov.in కి వెళ్లి.. చెక్ ఎన్‌రోల్‌మెంట్, అప్‌డేట్ స్టేటస్‌పై క్లిక్ చేసుకోవాలి.
7. URN నంబర్, క్యాప్చా ఎంటర్ చేయాలి. 90 రోజుల్లోగా UIDAI డేటాబేస్‌లో మీ మొబైల్ నంబర్ అప్‌డేట్ చేయబడుతుంది.