Bangalore City Civil Court dismissed the case filed against Naresh VK, Pavitra Lokesh’s Malli Pelli Movie: నటుడు నరేష్ వికే, పవిత్ర లోకేష్ కలిసి నటించిన సినిమా ‘మళ్లీ పెళ్లి’. ఎంఎస్ రాజు తెరకెక్కించిన ఈ సినిమాను విజయ కృష్ణ మూవీస్ పతాకంపై నరేష్ స్వయంగా నిర్మించారు. నరేష్ వ్యక్తిగత జీవితంలో జరిగిన, జరుగుతోన్న సంఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో నరేష్ రెండో భార్య రమ్య రఘుపతి పాత్రలో వనితా విజయ్ కుమార్ నటించగా.. సినీ నటిగా పవిత్ర లోకేశ్ నటించారు. మళ్లీ పెళ్లి సినిమా పోస్టర్స్, ట్రైలర్ రిలీజ్ అనంతరం నరేష్-పవిత్రల రియల్ లైఫ్ కథనే తెరకెక్కించినట్లు కనిపించడంతో.. ఈ సినిమాకు ఎక్కడ లేని క్రేజ్ వచ్చింది. దాంతో సినిమా విడుదలకు వ్యతిరేకంగా రమ్య రఘుపతి కేసు దాఖలు చేయగా.. తాజాగా తీర్పు వచ్చింది.
మళ్లీ పెళ్లి సినిమాను థియేటర్లు, ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో విడుదల చేయడాన్ని నిలిపివేయాలని రమ్య రఘుపతి బెంగుళూరులోని సిటీ సివిల్ కోర్టులో ఇంజక్షన్ దావా వేశారు. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయస్థానం.. రమ్య రఘుపతి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని మెరిట్‌లు లేని కారణంగా కొట్టివేస్తూ మంగళవారం తీర్పును వెలువరించింది. సినిమా విడుదలకు వ్యతిరేకంగా రమ్య రఘుపతి కేసు దాఖలు చేసిన కారణాలను న్యాయస్థానం సమర్థించలేనిదని, న్యాయపరంగా నిలకడగా లేదని కోర్టు పేర్కొంది.
Also Read: Ishan Kishan: మూడు వన్డేలలో హాఫ్ సెంచరీ చేసినా.. హ్యాపీగా లేను: ఇషాన్ కిషన్
బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన సర్టిఫికేట్ ఆధారంగా మళ్లీ పెళ్లి సినిమా కంటెంట్ పూర్తిగా కల్పితమని కోర్టు నిర్ధారించింది. సినిమా కల్పితమని సెన్సార్ బోర్డ్ సర్టిఫై చేశాక విడుదలను ప్రైవేట్ వ్యక్తి అడ్డుకునే ప్రసక్తే లేదని కోర్టు పేర్కొంది. తెలుగు, కన్నడ భాషలలో పెళ్లి సినిమా సినిమా సక్సెస్ ఫుల్‌గా థియేటర్లలో విడుదలైయింది. కోర్టు తీర్పు ప్రకారం అన్ని ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు, శాటిలైట్‌ల ద్వారా ఈ సినిమాని నిర్మాతలు స్వేఛ్చగా ప్రసారం చేయవచ్చు.
ఇక మరో కేసులో తీర్పు వచ్చింది. రమ్య రఘుపతిని నరేష్ నానక్‌రామ్‌గూడ ఇంట్లోకి ప్రవేశాన్ని నిషేధిస్తూ వేసిన ఇంజక్షన్ దావాను కోర్టు స్వీకరించింది. నరేష్‌పై గృహ హింస కేసు, నరేష్-పవిత్రపై రమ్య రఘుపతి ఇతర కేసు వేసిన విషయం తెలిసిందే. ఆ వెంటనే నరేష్, ఆయన కుటుంబ సభ్యులు.. రమ్య రఘుపతిపై గృహ నిషేదం కేసు పెట్టారు. ఈ కేసును పరిశీలించిన కోర్టు.. నరేష్ ఇంట్లోకి రాకుండా నిషేధం విధిస్తూ రమ్యకు ఆదేశాలు జారీ చేసింది. నరేష్, అతని కుటుంబం అందించిన సాక్ష్యాల ప్రకారం.. రమ్య రఘుపతి అక్కడ నివాసం లేదని, ప్రాపర్టీని వ్యాపార ప్రయోజనాల కోసం ఉపయోగిస్తుందని కోర్టు పేర్కొంది. రమ్య కోసం వస్తున్న గుర్తు తెలియని వ్యక్తుల వలన అక్కడ నివసించే సీనియర్ సిటిజన్స్, నరేష్ అసౌకర్యంతో పాటు అందోళనకు గురవుతున్నారని కూడా కోర్టు తెలిపింది.
Also Read: Nitin Chandrakant Desai Died: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ‘లగాన్’ ఆర్డ్ డైరెక్టర్ ఆత్మహత్య!