NTV Telugu Site icon

Srisailam Dam: తెరుచుకున్న శ్రీశైలం డ్యామ్ గేట్లు..

Srisailam Dam

Srisailam Dam

శ్రీశైలం జలాశయం గేట్లను అధికారులు కాసేపటి క్రితం ఎత్తేశారు. కృష్ణా నదిపై ఉన్న శ్రీశైలం జలాశయానికి ఎగువ నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో డ్యాం గేట్లను ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు 3 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి 80 వేల క్యూసెక్కుల నీటిని సాగర్కు విడుదల చేశారు అధికారులు. ఒక్కో గేటు నుంచి 27వేల క్యూసెక్యుల నీటిని విడుదల చేస్తు్న్నారు. 6, 7, 8 గేట్ల ద్వారా సాగర్ కు నీటిని విడుదల చేస్తున్నారు.

Read Also: Israel-Hezbollah: ఇజ్రాయిల్-హిజ్బొల్లా మధ్య యుద్ధ మేఘాలు.. లెబనాన్‌లోని ఇండియన్స్‌కి కేంద్రం జాగ్రత్తలు..

శ్రీశైలం ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో రూపంలో 4.67,210 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది.. మరోవైపు.. కుడి, ఎడమగట్టు జల విద్యుత్‌ కేంద్రాల్లో.. విద్యుత్‌ ఉత్పత్తి కొనసాగుతోంది. విద్యుత్‌ ఉత్పత్తి కోసం ఇప్పటికే 62,725 క్యూసెక్కుల నీటిని వాడుతూ.. దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం డ్యామ్‌ పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 879.90 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 182.6050 టీఎంసీలు ఉంది.

Read Also: Snakebite: ఏడాదిలో పాముకాటులో 50,000 మంది మృతి, ప్రపంచంలోనే అత్యధికం