వర్షాకాలం వస్తే రైతులు చాలా సంతోషిస్తారు.. కానీ వాహనాదారులు మాత్రం బాధపడతారు.. ప్రధాన నగరాల్లో రోడ్ల పైకి వెళ్లాలంటే భయపడుతున్నారు.. అందుకే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాలను తగ్గించవచ్చునని నిపుణులు అంటున్నారు.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. వర్షాకాలం రాకముందే వాహనాల ను చెక్ చేయించాలి.. ఏదైనా లోపాలు ఉంటే సర్వీసు చేయించాలి.. రోడ్ల మీద నీళ్లు ఎక్కువగా ఉంటాయి.. దానివల్ల బైక్ జారి కింద పడే అవకాశం ఉంటుంది.. ఇక వర్షా కాలంలో బైక్ పై వెళ్ళేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు చూద్దాం…
మీ బైక్ పాత టైర్లు అరిగిపోయినట్లయితే వెంటనే టైర్లను మార్పించుకోవాలి. అలా చెయ్యకుంటే టైర్లకు పంక్చర్ అవుతుంది. వర్షాకాలంలో వెళ్లేటప్పుడు పాత టైర్లు పట్టును కోల్పోయి స్కిడ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. దీంతో పాత టైర్లు మార్పించుకోని కొత్త టైర్లు వేయించుకోవడం మంచిది. అలాగే ఇండికేటర్ పనితీరును ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకుంటూ ఉండాలి.. బండి పార్ట్స్ కు ఏదైనా ప్రాబ్లేమ్స్ ఉంటే వాటిని కూడా చేయించుకోవడం మంచిది.
వర్షం కారణంగా చీకటిగా ఉంటుంది.. హెడ్ లైట్, టెయిల్ లైట్లు పనిచేయకపోతే ఇలాంటి సమయంలో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అలాగే బ్రేక్లను చెక్ చేయించుకోవాలి. ఒక్కొక్కసారి బ్రేక్ లు టైట్గా బిగుసుకుపోవడం వల్ల బైక్ సమయానికి ఆగదు. దీని వల్ల బైక్ స్కిడ్ అవుతూ ఉంటుంది. దీంతో బైక్ సర్వీసింగ్ చేయించు కోవడం మంచిది. అలాగే వర్షాకాలంలో హెల్మెట్ తప్పనిసరి గా ధరించాలి. రోడ్ల పై నీళ్లు, తడిగా ఉండటం వల్ల బైక్ స్కిడ్ అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.. హెల్మెట్ ఉంటే ప్రమాదం ఉండదు.. సేఫ్ గా చిన్న గాయాల తో బయటపడవచ్చు.. అంతేకాదు బైకు సీటు కవర్ ను మార్పించడం బెస్ట్.. వర్షం నీళ్లు తడవకుండా ఉంటాయి.. ఒక్క బైక్ కు మాత్రమే కాదు మనం కూడా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.. ప్రమాదం జరగకుండా మనమే తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది..