ఎల్ఐసీ పాలసీల గురించి అందరికీ తెలిసే ఉంటుంది.. ఎన్నో రకాల పాలసీలు ఉన్నాయి.. ఒక్కో పాలసీకి ఒక్కో బెనిఫిట్స్ ఉన్నాయి.. అందులో ఈ మధ్య కొత్త పాలసీలు వస్తున్నాయి.. వినియోగదారులకు మరింత సౌకర్యంగా ప్రయోజనకరంగా ఉండే విధంగా మరో పొదుపు ప్లస్ బీమా తో పాటు గ్యారంటీ రిటర్న్స్ విధానంలో ఓ కొత్త పాలసీని ఎల్ఐసీ తీసుకొచ్చింది. నవంబర్ 29న ప్రారంభించిన ఈ పథకం పేరు ఎల్ఐసీ జీవన్ ఉత్సవ్ ఈ పథకం గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఇది నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్, ఇండివిడ్యువల్, సేవింగ్స్, జీవితాంతం బీమా కవరయ్యే పాలసీ. ఆ పాలసీని ఒకసారి తీసుకుంటే ప్రీమియం చెల్లింపు ముగిసినా కూడా బతికున్నంత కాలం ఆదాయం పొందే వీలుంటుంది. హామీ మొత్తంలో 10శాతం ఆదాయంగా మీకు చెల్లిస్తారు.. మైనర్లు కూడా అర్హులే. కనీస కాల వ్యవధి 90 రోజులు ఉంటుంది. గరిష్టంగా 65 సంవత్సరాలు పాలసీ పనిచేస్తుంది. పాలసీ చెల్లించేందుకు గరిష్ట వయసు 75 ఏళ్లు ఉంటుంది. ఐదేళ్ల నుంచి 16ఏళ్ల వరకూ ప్రీమియం చెల్లించేందుకు అవకాశం ఉంటుంది. కనీస బీమా మొత్తం రూ. 5లక్షల నుంచి ప్రారంభమవుతుంది. కాలవ్యవధిని బట్టి వెయింటింగ్ పీరియడ్ ఉంటుంది. ఐదేళ్ల కాల వ్యవధికి ప్రీమియం చెల్లించేలా పాలసీ తీసుకుంటే ఐదేళ్లు వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది… ఈ పాలసీ తీసుకున్న వ్యక్తులు జీవించి ఉన్నంత కాలం పాలసీ ఉంటుంది..
ఎల్ఐసీ జీవన్ ఉత్సవ్ కనీస బీమా మొత్తం రూ. 5లక్షల బీమా మొత్తాన్ని 30ఏళ్ల వయసు కలిగిన వ్యక్తి, ఐదేళ్ల కాలపరిమితితో తీసుకుంటే ఏటా 2.17లక్షలు ప్రీమియంగా చెల్లించాల్సి ఉంటుంది. అదే వ్యక్తి 8ఏళ్ల ప్రీమియం ఆప్షన్ ఎంచుకుంటే రూ. 1.43లక్షల, 16ఏళ్ల ప్రీమియం టెర్మ్ ఎంచుకుంటే రూ. 58వేలు చెల్లించాల్సి ఉంటుంది.. అంతేకాదు డెత్ బీమా మొత్తం ప్లస్ గ్యారెంటీడ్ అడిషన్స్ ఎల్ఐసీ చెల్లిస్తుంది. డెత్ బీమా మొత్తం లేదా మీరు చెల్లించే వార్షిక ప్రీమియానికి ఏడు రెట్లు ఏది ఎక్కువైతే ఆ మొత్తాన్ని నామినీకి అందిస్తారు.. ఇక రెగ్యూలర్ ఆదాయం వద్దనుకుంటే అంతే ఎల్ఐసీ వద్దే ఉంచేసుకుంటే చక్రవడ్డీ ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది. పాలసీ ప్రారంభమైన ఏడాది నుంచి జీవించి ఉన్నంత వరకూ బీమా సదుపాయం కల్పిస్తారు. దీనిలో 90 రోజుల వయస్సున పిల్లల నుంచి 65ఏళ్ల వృద్ధుల వరకూ ఎవరైనా పాలసీలో చేరొచ్చు.. పన్ను మినహాయింపుతో పాటుగా లోన్ తీసుకొనే అవకాశం కూడా ఉంది..