LIC: జీఎస్టీ అథారిటీ పాట్నా నుంచి అందిన రూ.290 కోట్ల పన్ను నోటీసుపై అప్పీల్ దాఖలు చేయనున్నట్లు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసీ) శుక్రవారం తెలిపింది. బిహార్‌లోని పాట్నా అదనపు రాష్ట్ర పన్ను కమిషనర్ (అప్పీల్స్) వడ్డీ, జరిమానాతో పాటు వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) చెల్లించాలని డిమాండ్ చేసినట్లు ప్రభుత్వ రంగ బీమా కంపెనీ ఎల్‌ఐసి స్టాక్ మార్కెట్‌కు ఇచ్చిన సమాచారంలో తెలిపింది.
చదవండి:Silk Smita: మేకప్ ఆర్టిస్ట్ కాస్త హీరోయిన్ అయి.. జీవితాంతం ప్రేమకోసం పరితపించిపోయింది
ఎల్ఐసీ ఈ నోటీసుకు వ్యతిరేకంగా జీఎస్టీ అప్పిలేట్ ట్రిబ్యునల్ ముందు నిర్ణీత గడువులోపు అప్పీల్ దాఖలు చేస్తుంది. ప్రీమియం చెల్లింపుపై బీమా చేసిన వ్యక్తి నుంచి తీసుకున్న ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను ఎల్‌ఐసీ రీఫండ్ చేయలేదని, మరికొన్ని ఉల్లంఘనలపై జీఎస్టీ అధికారులు ఆరోపిస్తున్నారు. శుక్రవారం, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జిఎస్‌టి కూడా డెల్టా కార్ప్, దాని మూడు అనుబంధ సంస్థలకు 16822 కోట్ల రూపాయల పన్ను నోటీసును పంపింది. ఈ పన్ను బాధ్యత జూలై 2017- మార్చి 2022 మధ్య ఉంటుంది. డెల్టా కార్ప్‌కు రూ.11140 కోట్లు, అనుబంధ సంస్థలకు రూ.5682 కోట్ల నోటీసులు జారీ చేశారు.
చదవండి:Chinta Mohan: చంద్రబాబు 49 ఏళ్లుగా నాకు తెలుసు.. చాలా భయస్తుడు..!