Leopard: విషాదం.. ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిని ఎత్తుకెళ్లిన చిరుత..
- తమిళనాడులో పెను విషాద ఘటన..
- ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిని ఎత్తుకెళ్లిన చిరుత..
- అటవీ ప్రాంతంలో బాలిక మృతదేహం గుర్తింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Leopard: తమిళనాడులో పెను విషాద ఘటన చోటుచేసుకుంది.. ఇంటి ముందు ఆడుకుంటున్న నాలుగు సంవత్సరాల బాలిక రోషిణిని చిరుతపులి లాక్కెళ్లి దాడి చేసింది… కోయంబత్తూర్ సమీపంలోని వాల్పరైలోని టీ ఎస్టేట్‌లో తల్లిదండ్రులు టీ ఎస్టేట్‌లో పనిచేస్తుండగా బాలికపై చిరుత దాడి చేసింది. గంటల తరబడి గాలింపు చర్యలు తరువాత అటవీ ప్రాంతంలో బాలిక శరీర భాగాలను గుర్తించారు పోలీసులు.. అప్పటికే చిరుత పులి బాలికను సగం తిన్నట్లుగా పోలీసులు వెల్లడించారు..
Read Also: Rishabh Pant: సిక్స్ కొట్టి సెంచరీ పూర్తి చేసుకున్న రిషబ్ పంత్.. ఎంఎస్ ధోని రికార్డు బ్రేక్!
Also Read
- Government Scheme: అదిరిపోయే పెన్షన్ స్కీమ్.. రూ.55 కడితే చాలు.. ప్రతినెలా మీ అకౌంట్లోకి రూ.3000..!
- CM Chandrababu: పేదల సొంతింటి కలకు భరోసా.. విజయవాడలో నేడు 26,401 మందికి ఇళ్ల పట్టాలు
- Maruti Suzuki: చౌకైన మారుతి కార్లలోనూ ADAS.. సుజుకీ మాస్టర్ ప్లాన్..!
- RBI FD Rules 2026: బ్యాంకు ఎఫ్డీలపై ఆర్బీఐ కొత్త రూల్స్.. ప్రతీ రోజు వడ్డీ రేట్లు వెల్లడించాల్సిందే..
కోయంబత్తూర్ సమీపంలోని వాల్పరైలోని టీ ఎస్టేట్‌లో తల్లిదండ్రులు టీ ఎస్టేట్‌లో పని చేసుకుంటున్నారు. తమ నాలుగేళ్ల చిన్నారిని ఇంటి ముందు ఆడుకోమని చెప్పి.. అక్కడికి కొద్ది దూరంలోనే పనుల్లో నిమగ్నమయ్యారు. ఇంతలో ఎక్కడ నుంచి వచ్చిందో ఏమో రాకాసి చిరుత.. పాపం.. ఆడుకుంటున్న చిన్నారి రోషిణిపై దాడి చేసింది. అంతటితో ఆగకుండా.. ఆ చిన్నారితో తన నోటితో కరుచుకొని.. అడవుల్లోకి లాక్కెళ్లింది. నాలుగు సంవత్సరాల బాలికను చిరుతపులి లాక్కెళ్లిన ఘటన సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో కోయంబత్తూర్‌లోని వాల్పరై పట్టణానికి సమీపంలోని పచ్చమలై ఎస్టేట్‌లోని సౌత్ డివిజన్‌లో చోటు చేసుకుంది.
Read Also: Kingdom : అయోమయంలో కింగ్ డమ్.. ఏ డేట్ కు వస్తాడో..?
చిన్నారి రోషిణి, జార్ఖండ్‌కు చెందిన టీ ఎస్టేట్ కార్మికుడు మనోజ్ కుండ్ కుమార్తె. ఆమె ఇంటి ముందు ఆడుకుంటుండగా సమీపంలోని టీ తోట నుండి ఒక చిరుతపులి వచ్చి ఆమెపై దాడి చేసి, ఆమెను లాక్కెళ్లింది. ఈ సంఘటనను గమనించిన ఎస్టేట్ కార్మికులు అప్రమత్తమై గాలింపు చర్యలు చేపట్టారు. అయితే గంటల తరబడి ప్రయత్నించినప్పటికీ బిడ్డ ఆచూకీ లభించలేదు. దీంతో రోష్ని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. టీ ఎస్టేట్‌లో పనిచేసేందుకు పాపం వారు గత ఆదివారమే పని కోసం జార్ఖండ్ నుండి వాల్పరైకి వచ్చారు. ఇంతలో తమ చిన్నారికి ఇలా జరిగింది. చిన్నారిపై దాడి చేసి లాక్కెళ్లిన పులి.. ఆమెను ఏం చేసి ఉంటుందో అని అంతా కన్నీళ్లు పెట్టుకుంటున్న సమయంలో విషాద వార్త వినాల్సి వచ్చింది… అటవీ ప్రాంతం సమీపంలో చిన్నారి శరీర భాగాలను గుర్తించారు పోలీసులు.. దీంతో ఆ ప్రాంతమంతా విషాదఛాయలు అలుముకున్నాయి.
తాజావార్తలు
-
Government Scheme: అదిరిపోయే పెన్షన్ స్కీమ్.. రూ.55 కడితే చాలు.. ప్రతినెలా మీ అకౌంట్లోకి రూ.3000..!
-
Irumudi Movie Bridge: కుప్పకూలిన ‘ఇరుముడి’ సినిమా బ్రిడ్జి!
-
CM Chandrababu: పేదల సొంతింటి కలకు భరోసా.. విజయవాడలో నేడు 26,401 మందికి ఇళ్ల పట్టాలు
-
Maruti Suzuki: చౌకైన మారుతి కార్లలోనూ ADAS.. సుజుకీ మాస్టర్ ప్లాన్..!
-
RBI FD Rules 2026: బ్యాంకు ఎఫ్డీలపై ఆర్బీఐ కొత్త రూల్స్.. ప్రతీ రోజు వడ్డీ రేట్లు వెల్లడించాల్సిందే..
ట్రెండింగ్
-
165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?