NTV Telugu Site icon

Leopard in Dig : దారితప్పి గుంతలో పడి చిక్కుకుపోయిన చిరుత పులి..

Leopard3

Leopard3

Leopard in Dig : ఈ మధ్యకాలంలో అభయ అరణాలల్లో ఉండాల్సిన క్రూరమృగాలు ప్రజలు ఉండే ప్రాంతంలోకి రావడం కామన్ గా మారిపోయింది. పులులు, సింహాలు, ఎలుగుబంట్లు, చిరుతలు లాంటి అడవి జంతువులు కొన్నిసార్లు ప్రజలు ఉన్న ప్రాంతాల్లోకి రావడం పరిపాటిగా మారిపోయింది. గత కొన్ని రోజుల నుంచి ఏపీ లోని కర్నూలు, నంద్యాల, ప్రకాశం జిల్లాలలో చిరుతపులలు హల్చల్ చేస్తున్నాయి. తాజాగా నంద్యాల జిల్లాలోని మహానంది గుడి సమీపంలో ఓ చిరుత పులి తిరగడంతో ప్రజలు భయభ్రాంతులకు లోనవుతున్నారు. ఇక పరిస్థితి ఇలా ఉండగా మరోవైపు..

Pinnelli Ramakrishna Reddy : ఈవీఎం ధ్వంసం కేసులో మాజీ ఎమ్మెల్యేకు 14 రోజుల రిమాండ్..

ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు మండలం దేవనగరం సమీపంలో చిరుతపులి టెన్షన్ పెట్టించింది. అటవీ ప్రాంతం నుంచి దారితప్పి పోయి పేపర్ మిల్ సమీపంలోని ఓ గుంతలో పడిపోయింది చిరుతపులి. దీంతో చిరుత గుంతలో ఇరక్కపోయి బయటకి రాలేకపోయింది. అది చూసిన స్థానికులు వెంటనే సమాచారాన్ని అటవిశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఆ తర్వాత అటవీశాఖ అధికారులు గుంతపై వలలు వేసి చిరుత పులి బయటకు రాకుండా జాగ్రత్తగా తీసుకున్నారు.

AFG vs SA : సఫారీల దెబ్బకు ఆఫ్ఘనిస్తాన్ విలవిల.. 56 అల్ అవుట్..

ఈ నేపథ్యంలో దేవనగరంకు తిరుపతి నుండి అడవి శాఖ అధికారులు చిరుత పులిని బయటకు తీసి దానిని అడవిలో విడిచి పెట్టేందుకు ఓ రెస్క్యూ టీం చేరుకుంది. అయితే చీకటి పడటంతో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించేందుకు అనేక ఇబ్బందులు అడ్డు కావడంతో అధికారులు తెల్లవారుజామున చిరుతను బయటకు తీసేందుకు అన్ని ఏర్పాట్లను చేశారు. చిరుతను బయటికి తీసిన తర్వాత దానిని అభయారణ్యంలో వదిలెందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.