తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ లియో.ఈ యాక్షన్ థ్రిల్లర్ డ్రామాకు స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్ దర్శకత్వం వహించారు.గతేడాది అక్టోబర్‌లో భారీ హైప్ మధ్య రిలీజ్ అయిన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది.అయినా కూడా లియో సినిమా మంచి వసూళ్లను రాబట్టింది..థియేటర్ రన్ పూర్తి చేసుకున్న లియో సినిమా ఇప్పటికే నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు అందుబాటులో ఉంది. గత నవంబర్‌లో ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు వచ్చింది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ మరియు మలయాళంలోనూ ఈ సినిమా స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చింది.ఇదిలా ఉంటే ఇప్పుడు లియో తెలుగు వెర్షన్ మూవీ టెలివిజన్ (టీవీ) లోకి వచ్చేందుకు సిద్ధం అయింది.సంక్రాంతి సందర్భంగా లియో తెలుగు సినిమా టెలివిజన్‍లో ప్రసారం కానుంది. జనవరి 15వ తేదీ సాయంత్రం 6 గంటల 30 నిమిషాల నుంచి ఈ మూవీ జెమినీ టీవీలో టెలికాస్ట్ అవుతుంది. ఈ విషయాన్ని జెమినీ వెల్లడించింది.
లియో చిత్రంలో విజయ్ సరసన త్రిష హీరోయిన్‍గా నటించారు. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్, అర్జున్ సర్జా, గౌతమ్ వాసుదేవ్ మీనన్, జార్జ్ మరియన్, మిస్కిన్ మరియు మడోనా సెబాస్టియన్ ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించారు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందించారు. సెవెన్ స్క్రీన్స్ స్టూడియోస్ పతాకం పై లలిత్ కుమార్ మరియు జగదీశ్ పళనిస్వామి ఈ చిత్రాన్ని నిర్మించారు.లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్ (LCU) లో భాగంగానే లియోను దర్శకుడు లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించారు. లోకేశ్ గత చిత్రాలు ఖైదీ మరియు విక్రమ్‍లకు లియోకు లింక్ ఉంది. లియో ను కూడా తన మార్క్ యాక్షన్ మూవీగా లోకేశ్ రూపొందించారు. ఏ హిస్టరీ ఆఫ్ వైలెన్స్ అనే హాలీవుడ్ మూవీ స్ఫూర్తిగా లియో సినిమాను తెరకెక్కించారు