దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ లియో.. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కించారు..ఈ సినిమాలో దళపతి విజయ్ సరసన త్రిష హీరోయిన్ గా నటించారు. అక్టోబర్ 19 న దసరా కానుకగా గ్రాండ్ గా రిలీజ్ అయిన లియో మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చింది..ముఖ్యంగా సెకండాఫ్ సాగదీసినట్లుగా ఉందని ఫ్యాన్స్ విమర్శించారు. దీనికి తానే బాధ్యత వహిస్తున్నట్లు డైరెక్టర్ లోకేష్ కూడా చెప్పడం విశేషం. సినిమాకు థియేటర్లలో నెగటివ్ టాక్ వచ్చినా కూడా బాక్సాఫీస్ దగ్గర మాత్రం ఈ సినిమా సక్సెస్ అయింది.ప్రపంచవ్యాప్తం గా రూ.550 కోట్లకుపైగా వసూలు చేసింది. విజయ్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో మూవీ కావడంతో భారీ అంచనాల మధ్య సినిమా రిలీజైంది. అయితే తొలి షో నుంచే సినిమాకు నెగటివ్ రివ్యూలు రావడంతో విజయ్ ఫ్యాన్స్ నిరాశ చెందారు..
అయితే లియో మూవీ ఓటీటీ రిలీజ్ కోసం మాత్రం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.లియో మూవీ ఓటీటీ రిలీజ్ పై మేకర్స్ నుంచి కానీ, ఇటు ఈ మూవీ డిజిటల్ హక్కులు సొంతం చేసుకున్న నెట్‌ఫ్లిక్స్ నుంచి కానీ అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు.అయితే వచ్చే గురువారం (నవంబర్ 16) నుంచే ఈ సినిమా ఓటీటీలోకి రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.లియో మూవీ నవంబర్ 16 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. అయితే దీనిపై అధికారిక సమాచారం ఏదీ కూడా లేదు. అక్టోబర్ 19న రిలీజైన ఈ సినిమా.. ఆ మధ్య ఆన్‌లైన్లో లీకైందని, అందుకే అనుకున్నదాని కంటే ముందుగానే ఓటీటీలో కి వచ్చేస్తుందని వార్తలు అయితే వచ్చాయి. ఇక తాజాగా లియో ఓటీటీ రిలీజ్ మరో మూడు రోజులలోనే అంటూ సోషల్ మీడియాలో న్యూస్ తెగ వైరల్ అవుతుంది..మరి ఈ న్యూస్ పై చిత్రం యూనిట్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి..