HAL Clarifies: తేజస్ విమానం కూలిపోలేదు.. అసలు నిజం ఇదే: పుకార్లపై హెచ్ఏఎల్ స్పష్టత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
HAL Clarifies: ఇటీవల సోషల్ మీడియాలో, అలాగే కొన్ని మీడియా సంస్థల్లో తేజస్ యుద్ధ విమానం కూలిపోయిందనే వార్తలు వచ్చాయి. దీనిపై హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) తాజాగా స్పందిస్తూ, ఆ వార్తల్లో నిజం లేదని తేల్చి చెప్పింది. అసలేం జరిగిందంటే.. ఫిబ్రవరి 7న ఒక శిక్షణ ముగించుకుని తిరిగి వస్తున్న సమయంలో, విమానం బ్రేకులు సరిగ్గా పనిచేయకపోవడం వల్ల రన్‌వేను దాటి ముందుకు వెళ్లింది. ఆ సమయంలో పైలట్ సురక్షితంగా బయటకు దూకారు. ఇది కేవలం ఒక చిన్న సాంకేతిక సమస్యే తప్ప, విమానం కూలిపోలేదని HAL స్పష్టం చేసింది.
READ ALSO: Last Words Before D*eath: ప్రాణాలు విడిచే ముందు ప్రజలు చెప్పే చివరి మాటలు ఇవే..!
Also Read
ప్రపంచంలోని ఆధునిక యుద్ధ విమానాల్లో ‘తేజస్’ అత్యుత్తమ సెఫ్టీ రికార్డును కలిగి ఉందని, అనవసరమైన భయాందోళనలు చెందవద్దని HAL కోరింది. ఈ సంఘటన తర్వాత, భారత వైమానిక దళం (IAF) తమ వద్ద ఉన్న దాదాపు 30 తేజస్ జెట్‌లను క్షుణ్ణంగా తనిఖీ చేయడం కోసం తాత్కాలికంగా నిలిపివేసింది. సమస్య ఎక్కడుందో తెలుసుకోవడానికి IAF, HAL కలిసి పనిచేస్తున్నాయి. అమెరికాకు చెందిన GE ఏరోస్పేస్ కంపెనీ నుంచి ఇంజిన్ల సరఫరా ఆలస్యం కావడం వల్ల, కొత్త విమానాల డెలివరీలో కొంత జాప్యం జరుగుతోందని తెలుస్తుంది.
ఇదే సమయంలో భారత ప్రభుత్వం తేజస్ విమానాల కోసం భారీ పెట్టుబడులు పెట్టింది. 2021లో 83 తేజస్ Mk-1A జెట్ల కోసం ప్రభుత్వం రూ.48,000 కోట్ల ఒప్పందం కుదుర్చుకోగా, 2025 సెప్టెంబర్‌లో మరో 97 విమానాల కోసం రూ.62,370 కోట్ల భారీ ఒప్పందం కుదిరింది. వాస్తవాలు తెలియకుండా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయవద్దని హెచ్ఏఎల్ కోరింది. దేశీయంగా తయారైన ఈ యుద్ధ విమానం అత్యంత సురక్షితమైనదని అధికారులు వెల్లడించారు.
READ ALSO: Anil Ambani: అంబానీకి షాక్ ఇచ్చిన బాంబే హైకోర్టు..
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!