NTV Telugu Site icon

Laxman: ఎన్నికల కోసం కాదు.. వచ్చే తరాల కోసం మోదీ ఆలోచిస్తుంటారు..

Laxman

Laxman

విశాఖలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బీసీ సామాజిక చైతన్య సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా ఓబీసీ విభాగం జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, దగ్గుబాటి పురంధేశ్వరి, సీఎం రమేష్, సత్యకుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర జనాభాలో 70శాతం బీసీలు ఉన్నారని తెలిపారు. ఇక్కడ చైతన్యం కొరవడిందని గుర్తించి బీసీలను కదిలించి న్యాయం చేసేందుకు బీజేపీ ముందుకు వచ్చిందని అన్నారు. ఏపీలో బీసీలు అణచివేతకు గురవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలను బానిసలుగా, నోరు లేని జీవులుగా మార్చేశారని మండిపడ్డారు. 50శాతం బీసీ జనాభా ఉన్న ఆంధ్రప్రదేశ్ లో రాజ్యాధికారం కోసం కదలిరావాలి అని లక్ష్మణ్ పిలుపునిచ్చారు. హక్కుల సాధనకు ఎన్నికలను ఆయుధంగా మలుచుకోవాలని ఆయన తెలిపారు.

Purandeshwari: బీసీని దేశ ప్రధానిని చేయడం బీజేపీతోనే సాధ్యపడింది..

బీసీలు రాజకీయంగా ఒక అడుగు పైకి ఎక్కడానికి కృషి చేసిన ఘనత ఎన్టీఆర్ ది అని లక్ష్మణ్ అన్నారు. ఏపీలో బీసీల రిజర్వేషన్లు 20శాతం కుదించి ప్రభుత్వం అన్యాయం చేసిందని ఆరోపించారు. తెలుగు రాష్ట్రాల్లో ఇదే పద్దతి ఉందని అన్నారు. బీసీలకు అన్యాయం చేసి పడిగాపులు పడేలా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు.. మత్స్యకారుల కోసం కేంద్రంలో ఒక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేసిన ఘనత మోడీ సర్కారుకు దక్కుతుందని తెలిపారు. ఓట్ల కోసం ఉచితాల పేరుతో ప్రజలను మోసం చేసే ప్రభుత్వాలు ఉన్నాయి.. ఉచితాలకు మోసపోయే స్థితిలో బీసీలు లేరని లక్ష్మణ్ తెలిపారు. పస్తులు అయిన ఉంటారు కానీ.. బీసీలు ఆత్మగౌరవం తాకట్టు పెట్టుకోవడానికి సిద్ధంగా లేరని లక్ష్మణ్ పేర్కొన్నారు.

Bangladesh: బంగ్లాదేశ్‌లో ముగిసిన పోలింగ్, కౌంటింగ్ ప్రారంభం.. షేక్ హసీనా విజయం లాంఛనమే..

ఏపీ ముఖ్యమంత్రికి బీసీలకు ఎంబీసీలకు తేడా తెలియదని లక్ష్మణ్ దుయ్యబట్టారు. వచ్చే ఎన్నికల్లో బీసీ సాధికారితే రాజకీయ అజెండాగా మారాలి అని అన్నారు. సంచార జాతులు, కులాలను గుర్తించ లేని దుస్థితిలో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఉన్నాయని విమర్శించారు. మరోవైపు.. తల్లి కాంగ్రెస్ బీసీలను మోసం చేస్తే ఏపీలోని పిల్ల కాంగ్రెస్ అదే విధానం అవలంభిస్తోందని మండిపడ్డారు. కుల గణనకు రాష్ట్రాలకు కేంద్రం అనుమతి ఇస్తే ఓట్ల కోసం రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని పేర్కొన్నారు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సవాల్ చేస్తున్నా.. బీసీలకు జరిగిన అన్యాయంపై చర్చకు ఎప్పుడైనా ఎక్కడైనా సిద్ధం అని అన్నారు. తూర్పు కాపు, శిష్ఠ కర్ణాలు సహా ఉత్తరాంధ్రలో ఐదు కులాలకు త్వరలోనే EBC హోదా కల్పిస్తామని లక్ష్మణ్ తెలిపారు. బీసీలకు అన్యాయం జరుగుతుంటే పట్టించుకోని పార్టీలను ఓడించాలి అని తెలిపారు. బీసీ అజెండానా.. ఎన్నికల జెండా కావాలా అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో బీసీలకు అన్యాయం చేసిన పార్టీలకు బుద్ధి చెప్పాలని లక్ష్మణ్ కోరారు. ఇక ప్రధాని మోదీ ఎన్నికల కోసం కాదు.. వచ్చే తరాల కోసం ఆలోచిస్తుంటారని తెలిపారు.