Site icon NTV Telugu

Hyderabad: రోడ్డెక్కిన న్యాయవాదులు.. అసెంబ్లీ ముట్టడికి యత్నం

Hyderabad1

Hyderabad1

తెలంగాణలో న్యాయవాదులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. నిన్న ఓ న్యాయవాది అనుమానాస్పద రీతిలో మరణించిన ఘటనపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. న్యాయవాదులపై దాడులు పెరుగుతున్నాయని, తమ రక్షణ కోసం ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ను రాష్ట్రంలో వెంటనే అమలు చేయాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా న్యాయవాదులు ర్యాలీలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో న్యాయవాదులు అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించగా, పోలీసులు వారిని అడ్డుకున్నారు. హైదరాబాద్ గన్ పార్క్ వద్ద నిరసన తెలుపుతున్న న్యాయవాదులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిరసన కారులను అక్కడి నుంచి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

READ MORE: Hyderabad: మేడ్చలో క్రికెట్ బెట్టింగ్‌కి యువకుడు బలి..

అసలు ఏం జరిగింది?
హైదరాబాద్ మహానగరంలో నిన్న ఓ లాయర్‌ను హత్య చేశారు. చంపాపేట్ పరిధిలోని న్యూ మారుతి నగర్ కాలనీలో లాయర్ ఇజ్రాయెల్ పై కత్తితో దాడి చేశారు. దీంతో తీవ్రంగా గాయపడిన న్యాయవాది ఇజ్రాయెల్ ను అపోలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందించగా.. ట్రీట్మెంట్ పొందుతూ మృతి చెందారు. అయితే, హత్య అనంతరం ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్ లో నిందితుడు దస్తగిరి లోంగిపోయాడు. ఇక, మృతుడు నివాసం ఉంటున్న పై ఫ్లాట్ లో మహిళను వేధింపులకు గురి చేస్తున్న ఎలక్ట్రిషియన్ దస్తగిరి.. ఆ వేదింపులు భరించలేక అడ్వకేట్ ఇజ్రాయెల్ ను ఆమె ఆశ్రయించింది.
ఇక, మహిళతో కలిసి సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఎలక్ట్రిషియన్ దస్తగిరిపై న్యాయవాది ఇజ్రాయెల్ ఫిర్యాదు చేశారు. తనపై కంప్లైంట్ చేస్తావా అంటూ కక్ష కట్టిన నిందితుడు కత్తితో దాడి చేసి చంపేశాడు. కాగా, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడు అరెస్ట్ చేయగా.. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

Exit mobile version