మెగా కోడలు, వరుణ్ తేజ్ భార్య లావణ్య త్రిపాఠి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. హీరోయిన్గా బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది.. స్టార్ హీరోల సరసన నటించింది.. ఇక ఇటీవల సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న ఈ అమ్మడు లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.. తాజాగా స్టైలిష్ లుక్ లో మెరిసింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
వరుణ్, లావణ్య లు ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.. ఇటలీలో జరిగిన పెళ్ళికి మెగా ఫ్యామిలీ మొత్తం హాజరయ్యారు. ఇప్పుడు ఈ బ్యూటిఫుల్ కపుల్ వారి వారి ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉంటూ వైవాహిక జీవితాన్ని లీడ్ చేస్తున్నారు.. లావణ్య నిత్యం లేటెస్ట్ ఫొటోలతో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంటుంది.. తాజాగా లిఫ్ట్ లో స్టైలిష్ లుక్ లో స్టన్నింగ్ ఫోటోలను షేర్ చేసింది.. అవి కాస్త వైరల్ అవుతున్నాయి..
ఈ ఫోటోలకు నిహారిక కూడా రిప్లై ఇవ్వడంతో మరింత ట్రెండ్ అవుతున్నాయి.. ఇకపోతే వరుణ్ తేజ్ చివరగా నటించిన ఆపరేషన్ వాలంటైన్ చిత్రం ఆశించిన ఫలితం ఇవ్వలేదు.. ఇప్పుడు తదుపరి చిత్రంగా వస్తున్న మట్కా సినిమా పై ఫోకస్ పెట్టాడు.. అలాగే లావణ్య కూడా మిస్ పర్ఫెక్ట్ అనే వెబ్ సిరీస్ లో నటించింది.. ఆ సిరీస్ సూపర్ హిట్ అయ్యింది.. ఇప్పుడు వరుస సినిమాలను లైన్లో పెడుతుంది..