LAVA: గేమ్ ఛేంజర్.. ఇంటర్నెట్ లేకుండానే లైవ్ టీవీ, ఎమర్జెన్సీ అలర్ట్స్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
LAVA: ఫీచర్ ఫోన్ విభాగంలో గేమ్ ఛేంజర్ విధంగా, లావా ఇంటర్నేషనల్ లిమిటెడ్ తమ కొత్త డైరెక్ట్-టూ-మొబైల్ (D2M) ఫీచర్ ఫోన్లను ప్రకటించింది. టెజాస్, ఫ్రీ స్ట్రీమ్ టెక్నాలజీలతో కలిసి అభివృద్ధి చేసిన ఈ ఫోన్లు మొబైల్ మార్కెట్ లో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టనున్నాయి. ఈ ఫోన్లలో ఉపయోగించిన D2M టెక్నాలజీని మే 1 నుంచి 4 వరకు ముంబైలోని జియో వరల్డ్ సెంటర్ వేదికగా జరుగబోయే వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ (WAVES) 2025లో ప్రదర్శించనున్నారు. ఇప్పటికే ఫీల్డ్ ట్రయల్స్ విజయవంతంగా పూర్తయ్యాయి.
Read Also: DC vs KKR: టాప్ ప్లేస్ పై కన్నేసిన ఢిల్లీ క్యాపిటల్స్.. మొదట బ్యాటింగ్ చేయనున్న కేకేఆర్
Also Read
- Pak vs WI: వెస్టిండీస్‌పై బాబర్ సేన భారీ విజయం.! WTC పాయింట్ల పట్టికలో మార్పులు.!
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
ఈ ఫోన్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆవిష్కరించిన “మేక్ ఇన్ ఇండియా” పథకానికి అనుగుణంగా తయారు చేయబడ్డాయి. ఈ డివైస్‌లు ఆధారిత ప్రసార టీవీ తరంగాలను ఉపయోగించి ఇంటర్నెట్ లేకుండానే లైవ్ టీవీ, OTT వీడియోలు, ఆడియో, టెక్స్ట్ మెసేజెస్‌ను అందించగలవు. ప్రజా, జాతీయ ప్రాముఖ్యత కలిగిన సమాచారాన్ని సరఫరా చేయడం వీటి లక్ష్యం. ఇక ఈ లావా ఫోన్ లోని ముఖ్యమైన స్పెసిఫికేషన్స్ ను చూసినట్లయితే.. ఇందులో 2.8 అంగుళాల QVGA డిస్‌ప్లే, టీవీ ప్రసారాల స్వీకరణకు UHF యాంటెనా, వాయిస్ కాల్స్‌కి GSM సపోర్ట్, 2200mAh బ్యాటరీ, మీడియాటెక్ MT6261 ప్లాట్‌ఫారమ్‌పై నిర్మితమైన ఫోన్, సాంక్‌యా ల్యాబ్స్‌కు చెందిన SL3000 సాఫ్ట్‌వేర్ రిసీవర్ చిప్‌తో కూడిన ట్యూనింగ్, సాంక్‌యా ల్యాబ్స్ SDKతో కలసి పనిచేసే సాఫ్ట్‌వేర్ వినియోగదారులకు అంతరాయంలేని అనుభవాన్ని అందిస్తుంది.
ఈ ఫోన్లు ముఖ్యంగా గ్రామీణ, తక్కువ ఆదాయ ప్రజలకు సమాచారంతో పాటు వినోదాన్ని కూడా అందించాలన్న ఉద్దేశంతో రూపొందించబడ్డాయి. ఎమర్జెన్సీ అలర్ట్స్, ప్రభుత్వ సమాచారం, పబ్లిక్ బ్రాడ్‌కాస్టింగ్ కంటెంట్‌ను వేగంగా, విశ్వసనీయంగా అందించగలవు. అయితే ఇప్పటికే A1 జోష్ BOL, A5 2025 (UPI పేమెంట్స్‌తో), Action 4G (యూట్యూబ్ సపోర్ట్‌తో), A3 Torch వంటి లావా ఫీచర్ ఫోన్లు మార్కెట్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాయి. ఈ ఫోన్లలో బోల్స్ (BOL), క్లౌడ్ సర్వీసులు, యూజర్ సహకార ఫీచర్లు లభిస్తున్నాయి. ఇవన్నీ “వికసిత్ భారత్”కు మద్దతుగా పనిచేస్తున్నాయని కంపెనీ పేర్కొంది.
Read Also: IND W vs SA W: ఐదు వికెట్లతో చెలరేగిన స్నేహ రాణా.. భారత్ ఘన విజయం
D2M ఫీచర్ ఫోన్ల ధర, లభ్యతపై వివరాలు ఇంకా వెల్లడించలేదు. వాటిని WAVES 2025 కార్యక్రమంలో ప్రకటించే అవకాశం ఉంది. మొత్తంగా ఈ కొత్త టెక్నాలజీతో ఫీచర్ ఫోన్ మార్కెట్‌లో లావా పెద్ద మైలురాయిగా నిలుస్తోంది. ఇంటర్నెట్ అవసరం లేకుండా డిజిటల్ కంటెంట్‌ను అందించగల ఫోన్‌లు గ్రామీణాభివృద్ధికి దోహదం చేయనున్నాయి.
తాజావార్తలు
-
Huawei MateBook Pro S: హువావే మేట్‌బుక్ ప్రో ఎస్ విడుదల.. అత్యంత తేలికైన ల్యాప్‌టాప్.. Kirin XE90 ప్రాసెసర్
-
Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశి వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్త!
-
Raaka: ‘రాకా’లో షారుఖ్ ఉన్నారా? వైరల్ అవుతున్న గెస్ట్ రోల్ వార్తలపై క్లారిటీ!
-
Pak vs WI: వెస్టిండీస్‌పై బాబర్ సేన భారీ విజయం.! WTC పాయింట్ల పట్టికలో మార్పులు.!
-
Oppo F35 Pro: ఒప్పో F35 ప్రో భారత్ లో రిలీజ్ కు రెడీ.. 10,000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫోన్!
ట్రెండింగ్
-
144Hz డిస్‌ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!