NTV Telugu Site icon

Priyanka Gandhi: మిషన్‌ మధ్యప్రదేశ్‌ ప్రారంభం. ప్రచారంలో పాల్గొన్న ప్రియాంకా గాంధీ..!

Priyanka

Priyanka

Priyanka Gandhi: కర్నాటక, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో విజయం తర్వాత కాంగ్రెస్ జోరు మీదుంది. ఇవాళ మిషన్ మధ్యప్రదేశ్ ను ప్రియాంక గాంధీ ప్రారంభించారు. అంతకుముందు మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు కమల్‌నాథ్‌, పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌ జనరల్‌ సెక్రటరీ జేపీ అగర్వాల్‌, రాజ్యసభ ఎంపీ వివేక్‌ తంఖాతో కలిసి గ్వారిఘాట్‌లో నర్మదా నది ఒడ్డున ప్రియాంక పూజలు చేశారు. అక్కడ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రియాంకా.. బీజేపీని గద్దె దించేందుకు హస్తం పార్టీ అస్త్రాలను సిద్ధం చేసుకుంటుంది. మత రాజకీయాలకు మధ్యప్రదేశ్‌ అడ్డాగా మారిందని.. మతకలహాలు సృష్టించి బీజేపీ ఎన్నికల్లో విజయం సాధిస్తోందని ప్రియాంకా గాంధీ ఆరోపించారు.

Read Also : Nikhil ‘Spy’ release: నిఖిల్ ‘స్పై’ రిలీజ్ డేటుపై భేదాభిప్రాయాలు..చెప్పిన డేటుకు డౌటే?

అంతేకాకుండా రాష్ట్రంలో గత మూడేళ్లుగా బీజేపీ ఏం చేసిందని ప్రియాంక గాంధీ ప్రశ్నించారు. ప్రస్తుత బీజేపీ ప్రభుత్వంలో ఎవరొక్కరి జీవితమైనా బాగుపడిందా అంటూ.. మోడీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో ఓడిపోవడం బీజేపీకి చెంపపెట్టు అని అన్నారు. మరోవైపు 2018లో జరిగిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపొందగా.. రెండేళ్ల తర్వాత జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరారు. అంతేకాకుండా ఆయనతో పాటు 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పట్టుకుపోయారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయి, బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

Read Also : Civil Services: సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఫలితాలు విడుదల..

ఈ ఏడాది చివర్లో మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే పలు హిందూ సంఘాలు కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించాయి. మాజీ సీఎం కమల్‌నాథ్‌ సమక్షంలో భారీ సంఖ్యలో బజరంగ్‌ సేన కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరారు. అయితే ప్రియాంక మధ్యప్రదేశ్‌ పర్యటనపై బీజేపీ నేతలు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. ఎన్నికలు ఉన్నప్పుడే ప్రియాంకకు పూజలు గుర్తుకు వస్తాయని.. హిమాచల్‌ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఇప్పటికి నెరవేర్చలేదని అక్కడి బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.

Show comments