NTV Telugu Site icon

Prabhas : యమజోరు మీదున్న ప్రభాస్.. ఎట్ ఏ టైంలో స్పిరిట్ కూడా !

Spirit

Spirit

Prabhas : రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఆయన సినిమాల స్పీడ్ పెంచాడు. తన లైనప్ లో ఇప్పుడు ఏకంగా అరడజన్ కు పైగా సినిమాలున్నాయి. బాహుబలితో ఐదేళ్లు రెండు సినిమాలకే పరిమితమయ్యాడన్న కామెంట్స్ రావడంతో అప్పటి నుంచి వరుస సినిమాలతో పాన్ ఇండియా లెవల్లో రచ్చ కొనసాగిస్తున్నాడు. గతేడాది సలార్ తో వరుస ఫ్లాపులకు ఫుల్ స్టాప్ పెట్టి.. కల్కి 2898 ఏడితో అదరగొట్టాడు. ప్రస్తుతం ప్రభాస్ మారుతి డైరెక్షన్ లో రాజా సాబ్ అనే సినిమా చేస్తున్నాడు. దీనితో పాటు త్వరలోనే కల్కి 2 సినిమా పనులు కూడా మొదలు పెట్టబోతున్నారని తెలుస్తుంది.

Read Also:Delhi Nyay Yatra: 30 రోజులు, 360 కిలోమీటర్ల పాదయాత్ర.. నేటి నుంచి ‘న్యాయ యాత్ర’

అయితే తాజాగా ప్రభాస్ స్పిరిట్ కి సంబంధించిన అప్డేట్ కూడా ఆయన అభిమానులను సర్ ప్రైజ్ చేస్తుంది. ఈ సినిమాను డిసెంబర్ నుంచి సెట్స్ మీదకు తీసుకెళ్లబోతున్నట్లు తెలుస్తోంది. యానిమల్ తర్వాత సందీప్ వంగ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. బాలీవుడ్ మేకర్ భూషణ్ కుమార్ భారీ బడ్జెట్ తో ఈ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ నిర్మిస్తున్నారు. స్పిరిట్ సినిమాలో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‎గా కనిపిస్తారని తెలుస్తుంది. అయితే స్పిరిట్ డిసెంబర్ నుంచి మొదలు పెడితే ప్రభాస్ కూడా తన డేట్లు ఇస్తున్నట్లు తెలుస్తుంది. ప్రభాస్ ఫౌజి కూడా ప్రస్తుతం సెట్ల మీద ఉంది. ఈ సినిమాలతో రెబల్ స్టార్ ఫ్యాన్స్ ని ఖుషి చేస్తుంది. కల్కి 2, ఫౌజి, స్పిరిట్ ఈ మూడు సినిమాలతో ప్రభాస్ మరోసారి బాక్సాఫీస్ పై తన మాస్ స్టామినా చూపించేందుకు సిద్ధం అవుతున్నాడు.

Read Also: SA vs IND: నేడే దక్షిణాఫ్రికాతో తొలి టీ20.. భారత జట్టులో ఎవరుంటారు?

కల్కి 1తో రూ.1000 కోట్ల మార్క్ మళ్లీ రీచ్ అయిన ప్రభాస్ రాబోతున్న సినిమాలతో మరోసారి ఆ టార్గెట్ పెట్టుకున్నాడు. రాజా సాబ్ సినిమా 2025 ఏప్రిల్ లో రిలీజ్ అవుతుండగా తర్వాత సంవత్సరం మరో సినిమా కూడా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. హను రాఘవపుడి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఫౌజి సినిమా పీరియాడికల్ డ్రామాగా వస్తుంది కాబట్టి ఈ సినిమాపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి 2 కోసం కొంత సమయం కేటాయించాల్సి ఉంటుంది. అయితే కల్కి 1 లోనే పార్ట్ 2 కి సంబంధించిన సీన్లు షూట్ చేశారని తెలుస్తుంది. ఇక మరోపక్క ఫౌజి కోసం ప్రభాస్ కొత్త మేకోవర్ తో కనిపించబోతున్నాడు. స్పిరిట్ లో పోలీస్ పాత్రలో కూడా ప్రభాస్ అదరగొడతాడని తెలుస్తుంది.

Show comments