Gold Rates: శుభవార్త.. మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. 10 గ్రాముల ధర ఎంతంటే..
- మళ్లీ తగ్గిన బంగారం ధరలు..
- 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1.61 లక్షలు..
- 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1.41 లక్షలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగారం ధరల్లో ఊహించని మార్పులు చోటు చేసుకున్నాయి. యుద్ద ప్రభావం కారణంగా మరోసారి బంగారం ధరలు తగ్గాయి. బంగారం కొనే వారికి ఇది నిజంగా శుభవార్త అనే చెప్పాలి. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఉదయం రూ.770, సాయంత్రం రూ.980 తగ్గి రూ.1,61,130 వరకు దిగి వచ్చింది. అలానే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఉదయం రూ.770, సాయంత్రం రూ.900 తగ్గి.. ప్రస్తుతం రూ.1,47,400గా నమోదైంది. అయితే వెండి ధరల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. కిలో వెండి ధర ప్రస్తుతం రూ.2,90,000 పలుకుతోంది.
బంగారం ధరలు తగ్గడానికి ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, ఆర్థిక అంశాలు, పెట్టుబడిదారుల ప్రవర్తన కారణమవుతాయి. ప్రస్తుతం ఉన్న మార్కెట్ విశ్లేషణల ప్రకారం.. బంగారం ధరలు తగ్గడానికి ప్రధాన కారణాల్లో ముఖ్యంగా.. అమెరికన్ డాలర్ బలం. బంగారం అంతర్జాతీయంగా అమెరికన్ డాలర్లలోనే ట్రేడ్ అవుతుంది. డాలర్ విలువ పెరిగినప్పుడు.. ఇతర కరెన్సీలు కలిగిన దేశాలకు బంగారం కొనడం ఖరీదైనదిగా మారుతుంది. దీనివల్ల అంతర్జాతీయంగా డిమాండ్ తగ్గి, ధరలు పడిపోతాయి.
Also Read
Also Read: Gold Rates: శుభవార్త.. మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. 10 గ్రాముల ధర ఎంతంటే..
బంగారం అనేది ఎటువంటి ఆదాయాన్ని (వడ్డీని) ఇవ్వని పెట్టుబడి. బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు లేదా బాండ్ల ద్వారా మంచి వడ్డీ లభిస్తున్నప్పుడు.. పెట్టుబడిదారులు బంగారం కంటే వాటివైపే మొగ్గు చూపుతారు. అమెరికా కేంద్ర బ్యాంక్ (US Federal Reserve) వడ్డీ రేట్ల విషయంలో తీసుకునే నిర్ణయాలు, అంచనాలు బంగారం ధరపై తీవ్ర ప్రభావం చూపుతాయి.
అన్నింటి కంటే ప్రధాన కారణం.. అంతర్జాతీయ పరిస్థితులు. సాధారణంగా యుద్ధాలు లేదా అనిశ్చితి ఉన్నప్పుడు బంగారం ధరలు పెరుగుతాయి. అయితే.. కొన్నిసార్లు మార్కెట్‌లో పరిస్థితి కొంత కుదుటపడిందని పెట్టుబడిదారులు భావించినప్పుడు లేదా భయం తగ్గితే, వారు బంగారం నుంచి తమ పెట్టుబడులను తీసివేసి స్టాక్ మార్కెట్ వంటి ఇతర లాభదాయక రంగాల వైపు మళ్లిస్తారు. దీనివల్ల బంగారంపై డిమాండ్ తగ్గి ధరలు తగ్గుతాయి. చాలా మంది స్వల్పకాలిక ట్రేడర్లు మార్కెట్ అంచనాల ఆధారంగా బంగారాన్ని కొంటూ.. అమ్ముతూ ఉంటారు. మార్కెట్ సెంటిమెంట్ మారినప్పుడు లేదా ప్రైస్ లెవల్స్ బ్రేక్ అవ్వనప్పుడు భారీగా అమ్మకాలు జరిగి ధరలు హఠాత్తుగా తగ్గుతుంటాయి.
తాజావార్తలు
-
T20 World Cup Final: టీ20 వరల్డ్ కప్ ఫైనల్.. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా..
-
Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ ఐరన్ లెగ్.. తెరపైకి కొత్త డిమాండ్..
-
Indian Player: మూడో టీ20కి ఛాన్స్ కొట్టేసిన యువ క్రికెటర్.. ఇక ఇంగ్లాండ్‌కు చుక్కలే..
-
CM Chandrababu : కుప్పం నుంచే విజయదుందుభి.. మున్సిపల్, స్థానిక ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలి
-
YS Jagan : హే రామ్.. సేవ్ ఆంధ్రప్రదేశ్.. కూటమి ప్రభుత్వంపై వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్‌పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!