Lara Williams: హైదరాబాద్‌లో కొత్త యుఎస్ కాన్సుల్ జనరల్‌గా లారా విలియమ్స్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో యుఎస్ కాన్సుల్ జనరల్‌గా పనిచేయడం తనకు ఎంతో గర్వకారణమన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా అంతటా యుఎస్-ఇండియా భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి తాను ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. భారత్, అమెరికా మధ్య దౌత్య సంబంధాలను మెరుగుపర్చడానికి తాను ప్రాధాన్యమిస్తానని స్పష్టం చేశారు. ఇరు దేశాల ప్రజల మధ్య సంబంధాలను బలోపేతం చేసేందుకు తాను కట్టుబడి ఉన్నానన్నారు. హైదరాబాద్‌ను గొప్ప ప్రాంతంగా అభివర్ణించారు.
READ MORE: TG Vishwa Prasad: నా విమర్శలు వ్యవస్థపై మాత్రమే, ప్రతిభపై కాదు
ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న యూఎస్ కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ స్థానంలో లారా విలియమ్స్ వచ్చారు. ఆమె గతంలో యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్‌లో ఎంటర్ప్రైజ్ సర్వీసెస్‌కు డిప్యూటీ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్‌గా పనిచేశారు. వాషింగ్టన్‌లోని దౌత్యవేత్తలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాయబార కార్యాలయాలను అనుసంధానించే సమాచార సాంకేతిక వేదికల సూట్‌ను నిర్వహించారు. తన కెరీర్ మొత్తంలో సున్నితమైన డేటాను భద్రపరచడం, ప్రజా దౌత్యాన్ని విస్తృతం చేయడానికి వినూత్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం వంటి విధులు చేపట్టారు. నికోసియా, అల్జీర్స్, రోమ్, మెక్సికో నగరాల్లోని అమెరికా రాయబార కార్యాలయాలలో విధులు నిర్వర్తించారు. వాషింగ్టన్, డి.సి.లోని విదేశాంగ శాఖ ప్రధాన కార్యాలయంలో సైతం డిప్లొమాటిక్ టెక్నాలజీ బ్యూరో, సెక్రటరీ ఆపరేషన్స్ సెంటర్, రిక్రూట్మెంట్ ఆఫీస్, ఫారిన్ సర్వీస్ ఇన్స్టిట్యూట్ స్కూల్ ఆఫ్ అప్లైడ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సైబర్‌స్పేస్, డిజిటల్ పాలసీ బ్యూరో, సెంటర్ ఫర్ అనలిటిక్స్ వంటి పదవులతో సహా విభిన్న పోర్ట్‌ఫోలియోలను నిర్వహించారు.
READ MORE: Trump Tariffs: ట్రంప్ సుంకాల మోతకు “ఆపరేషన్ సిందూర్” కారణమా..? సంచలన విషయాలు..!