వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా ఈరోజు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో న్యూజిలాండ్-శ్రీలంక మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో శ్రీలంక ముందుగా బ్యాటింగ్ కు దిగింది. ఈ క్రమంలో శ్రీలంక బ్యాటర్ కుశాల్ పెరీరా ఆకాశమే హద్దుగా చెలరేగాడు. క్రీజులో ఉన్నంతసేపు కివీస్ బౌలర్లకు పెరెరా చుక్కలు చూపించాడు. కేవలం 22 బంతుల్లోనే 9 ఫోర్లు, 2 సిక్స్‌లు కొట్టి అర్ధసెంచరీ సాధించాడు. దీంతో ఈ వరల్డ్‌కప్‌లో ఫాస్టెస్ట్ ఫిప్టి చేసిన ఆటగాడిగా పెరీరా నిలిచాడు.
Read Also: WPL 2024: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ఈసారి ఈ నగరాల్లోనే.. వేలం కూడా అప్పుడే..!
ఇప్పటివరకు ఈ రికార్డు ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ పేరిట ఉండేది. ఈ మెగా టోర్నీలో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో హెడ్ కేవలం 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. అయితే ఈ మ్యాచ్‌తో కుశాల్ పెరీరా ఆ రికార్డును బ్రేక్ చేశాడు. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్ లో 51 పరుగులు చేసిన పెరీరా.. ఫెర్గ్యూసన్ బౌలింగ్ లో ఔటయ్యాడు.
Read Also: World Cup 2023: వరల్డ్ కప్ సెమీస్, ఫైనల్ మ్యాచ్ టికెట్ విక్రయాలు నేడే…
ఇక ఈ మ్యాచ్ విషయానికొస్తే.. శ్రీలంక భారీ కష్టాల్లో పడింది. 26 ఓవర్లలో కేవలం 115 పరుగులు చేసి 8 వికెట్లు కోల్పోయింది. కివీస్ బౌలర్లలో ఇప్పటివరకు ట్రెంట్ బౌల్ట్ మూడు వికెట్లు తీయగా.. శాంట్నర్, ఫెర్గూసన్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. సౌథీకి ఒక వికెట్ దక్కింది.