NTV Telugu Site icon

Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌లో పలుచోట్ల విరిగిపడిన కొండచరియలు.. అమర్‌నాథ్ యాత్ర నిలిపివేత..!

Jammu

Jammu

జమ్మూకశ్మీర్‌లో శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షాల కారణంగా పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో పలు ప్రధాన రహదారులను మూసివేశారు. శనివారం జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారి మరియు మొఘల్ రోడ్డులో వాహనాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. వాటితో పాటు భారీ వర్షాల కారణంగా అమర్‌నాథ్ యాత్రను వరుసగా రెండో రోజూ నిలిపివేశారు.

Delhi : పోర్న్ వీడియోలను చూడాలని భార్యను బలవంతం పెట్టిన భర్త .. కట్ చేస్తే సీన్ రివర్స్..

జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారి, మొఘల్ రోడ్ మరియు శ్రీనగర్-సోన్‌మార్గ్-గుమ్రీ రోడ్‌తో సహా ప్రధాన రహదారులపై భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయని అధికారులు తెలిపారు. దీంతో ఈ మార్గాలన్నీ మూసివేసినట్లు తెలిపారు. రోడ్లపై రాళ్లు, చెత్తాచెదారం ఉండడంతో రాకపోకలు స్తంభించాయి. మరోవైపు రోడ్లపై ఉన్న చెత్తను తొలగించే వరకు ప్రజలు ఈ రోడ్లపై ప్రయాణించవద్దని అధికారులు కోరారు.

West Bengal: బెంగాల్లో కొనసాగుతున్న హత్యా రాజకీయం.. ఇప్పటివరకు 14 మంది మృతి..!

రాంబన్‌లోని శ్రీనగర్-జమ్మూ జాతీయ రహదారిపై భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయని రాంబన్ ఎస్‌ఎస్‌పి మోహిత శర్మ తెలిపారు. కొండచరియలు విరిగిపడటం మరియు రాక్ పడిపోవడంతో.. వాటిని తొలగించే వరకు రహదారిని మూసివేశారు. ఈ రోడ్డు మార్గంలో ప్రయాణించే వారు ముందుగా ట్రాఫిక్ కంట్రోల్ యూనిట్ (టీసీయూ) సలహా తీసుకోవాలని ఎస్‌ఎస్పీ శర్మ తెలిపారు. NH-44, మొఘల్ రోడ్ మరియు SSG రోడ్‌లను బ్లాక్ చేసినట్లు అధికారులు తెలిపారు. బనిహాల్ మరియు ఖాజీగుండ్ స్టేషన్ల మధ్య రైలు సర్వీసును కూడా రోజంతా నిలిపివేసినట్లు ఆయన చెప్పారు.

Karnataka: కర్ణాటకలో జైన మత గురువు హత్య.. ఇద్దరు అరెస్ట్

భారీ వర్షం కురుస్తుండటంతో రెండోరోజు అమర్‌నాథ్ యాత్రను నిలిపివేశారు. వాతావరణం అనుకూలించకపోవడంతో యాత్రికులను పహల్గాం, బల్తాల్ మార్గాల్లో ప్రయాణాన్ని ఆపేయాల్సి వచ్చింది. ప్రతికూల వాతావరణం కారణంగా ప్రయాణీకులను ముందుకు వెళ్లనివ్వడం లేదని అధికారులు తెలిపారు.