NTV Telugu Site icon

Lalu Yadav: దేశంలో జరుగుతున్న రైలు ప్రమాదాలకు బాధ్యులెవరు..?

Lalu

Lalu

పశ్చిమ బెంగాల్‌లోని న్యూ జల్‌పైగురిలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో ఇప్పటివరకూ 8 మంది మరణించారు. అంతేకాకుండా.. 50 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. కాగా.. ఈ రైలు ప్రమాద ఘటనపై ఆర్జేడీ అధినేత, మాజీ రైల్వే మంత్రి లాలూ యాదవ్‌ ప్రశ్నలు సంధించారు. దేశంలో జరుగుతున్న రైలు ప్రమాదాలకు ఎవరు బాధ్యులని ప్రశ్నించారు. గత ఏడాది కాలంలో 7 పెద్ద రైల్వే ప్రమాదాలు జరిగిన సంగతి తెలిసిందే.. ఈ సందర్భంగా.. బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ యాదవ్ ‘X’ లో పోస్ట్ చేశారు. దేశంలో తరచుగా జరుగుతున్న రైల్వే ప్రమాదాలకు బాధ్యులు ఎవరు అని ఆయన ప్రశ్నించారు.

Bengal Train Accident: బెంగాల్ రైలు ప్రమాద ఘటన.. మృతి చెందిన వారిలో లోకో పైలట్, సహాయకుడు

ఈరోజు కతిహార్ డివిజన్‌లోని రంగపాణి-నిజబరీ స్టేషన్‌ల మధ్య స్టేషన్‌లో నిలిచి ఉన్న కాంచనజంగా ఎక్స్‌ప్రెస్‌ను వెనుక నుండి గూడ్స్ రైలు ఢీకొట్టింది. ఈ క్రమంలో.. కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన మూడు బోగీలు పట్టాలు తప్పాయి. గట్టిగా ఢీకొట్టడంతో ఒక బోగీ మరో బోగీపైకి ఎక్కింది. ఇందులో 8 మందికి పైగా మృతి చెందినట్లు నిర్ధారించారు. 50 మందికి పైగా గాయపడ్డారని.. వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన మృతుల కుటుంబాలకు రైల్వే మంత్రి ఒక్కొక్కరికి రూ.10 లక్షల సాయం ప్రకటించారు.

Bengal rail accident: మృతుల కుటుంబాలకు కేంద్రం రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా..

కాగా.. గత ఏడాది కాలంలో దేశంలో 7కు పైగా పెద్ద రైల్వే ప్రమాదాలు జరిగాయి. 2023 జూన్ 2న ఒడిశాలోని బాలాసోర్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో 296 మంది చనిపోయారు. 2023 అక్టోబర్ 29న ఆంధ్రాలోని విజయనగరం కంటపల్లి వద్ద రెండు ప్యాసింజర్ రైళ్లు ఢీకొన్న ప్రమాదంలో 14 మంది ప్రయాణికులు మరణించారు. 50 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జమ్తారాలో జరిగిన రైలు ప్రమాదంలో ఇద్దరు మరణించారు. గత ఏడాది అక్టోబర్‌లో బక్సర్‌లోని రైల్వే స్టేషన్ సమీపంలో రైలు ప్రమాదానికి గురైంది. రైలులోని 24 కోచ్‌లు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో 60 మందికి పైగా గాయపడినట్లు నిర్ధారించారు. నలుగురు మరణించారు.