NTV Telugu Site icon

Tragedy : విషాదంగా మారిన సచివాలయం ఉద్యోగి లలిత మిస్సింగ్

Lalitha

Lalitha

కాకినాడ జిల్లా జీఎం.పేట సచివాలయ ఉద్యోగి ఆదృశ్యం కేసు విషాదంగా మారింది. కుంభాభిషేకం రేవు దగ్గర లలిత మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. పెళ్లి కోసం లలితను మరో మతంలోకి మారాలని ఒత్తిడి తెచ్చారని సమాచారం. నిన్న ఇంట్లో నుంచి వెళ్లిపోయిన లలిత. గత నెల 22న నిశ్చితార్థం, ఈనెల 22న పెళ్లి ఫిక్స్‌ అయింది. అయితే.. యువతి అదృశ్యమైన ఘటన మంగళవారం యు.కొత్తపల్లిలోని అమరవిల్లి గ్రామంలో జరిగింది. అమరవిల్లి గ్రామానికి చెందిన వాకా లలిత (25) అనే యువతి గత రెండు రోజుల నుండి కనబడటం లేదని తొండంగి పోలీస్‌ స్టేషన్‌ లో ఫిర్యాదు చేసినట్లు బంధువులు తెలిపారు.

 Dinesh Karthik: మళ్లీ బ్యాట్ పట్టనున్న దినేష్ కార్తీక్.. తొలి క్రికెటర్‌గా రికార్డు!

తొండంగి మండలం జిఎం పేట గ్రామంలోని సచివాలయం లో ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌ గా ఉద్యోగం చేస్తున్న లలితకు అదే గ్రామానికి చెందిన వ్యక్తితో లలిత తండ్రి వివాహం చేసేందుకు నిశ్చయించారు. ఈక్రమంలో వివాహానికి సంబంధించి మాటలు జరుగుతుండగా, ఉద్యోగానికి వెళుతున్నానని చెప్పి వెళ్లిన యువతి తిరిగి ఇంటికి రాలేదని కుటుంబీకులు తెలిపారు. దీనిపై తొండంగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని గ్రామస్తులు తెలిపారు. పెళ్లి పీటలు ఎక్కాల్సిన కూతురు.. మృత్యు ఒడికి చేరే సరికి కన్నీరు మున్నీరు అవుతున్నారు కుటుంబ సభ్యులు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

 Fishermens Arrest: శ్రీలంక నేవీ అదుపులో 22 మంది తమిళ మత్స్యకారులు..