NTV Telugu Site icon

Lake Front Park: హైదరాబాద్ లో రేపటి నుంచి అందుబాటులోకి లేక్ ఫ్రంట్ పార్క్..

Lake Fornt Park

Lake Fornt Park

హుస్సేన్ సాగర్ సరసన హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ తీర్చిదిద్దిన లేక్ ఫ్రంట్ పార్క్ రేపటి (అక్టోబర్ 1వ తేదీ) నుంచి సందర్శకులకు అందుబాటులోకి రానుంది. దాదాపు 26.65 కోట్ల రూపాయల వ్యయంతో రూపుదిద్దుకున్న ఈ లేక్ ఫ్రంట్ పార్క్‎ను గత మంగళవారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరంభించారు. లేక్ ఫ్రంట్ పార్క్ ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉండనుందని తెలిపారు. ఉదయం 5 గంటల నుంచి 9 గంటల వరకు వాకర్స్‏కు అనుమతి ఉంటుంది. ఇక, నెలకు 100 రూపాయల చొప్పున చెల్లించి మార్నింగ్ వాకర్స్ ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని హెచ్ఎండీఏ తెలిపింది.

Read Also: Madam Chief Minister: దర్శకనిర్మాతే హీరోయిన్ గా ‘మేడం చీఫ్ మినిస్టర్’

ఇక, అదే విధంగా ఈ లేక్ ఫ్రంట్ పార్కులో ఫంక్షన్లకు కూడా పర్మిషన్లు ఇస్తున్నారు. 11 వేల రూపాయలు చెల్లించి ప్రత్యేకంగా బర్త్ డే ఫంక్షన్స్, గెట్ టు గెదర్ ఫంక్షన్స్, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించుకునే వెసులుబాటు కల్పించారు. ఈ ఫంక్షన్స్ కి వంద మందికి మించకుండా చేసుకునే సదుపాయాన్ని కూడా హెచ్ఎండీఏ ఈ పార్కులో అవకాశం ఇచ్చింది. పర్యాటకుల కోసం ఈ లేక్ ఫ్రంట్ పార్క్‎లో కరాచీ బేకరీ అవుట్ లెట్‏తో పాటు మరికొన్ని అవుట్ లెట్స్ ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. ఈ పార్కును సందర్శకుల కోసం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అందుబాటులో ఉంచనున్నట్లు హెచ్ఎండీఏ అధికారులు పేర్కొన్నారు. ఈ పార్క్ అందుబాటులోకి రావడంతో జల్ విహార్, PVNR మార్గ్ సమీపంలోని ఈ లేక్ ఫ్రంట్ పార్క్ సాధారణ ప్రజలకు కేంద్రంగా నిలవనుంది.